NTV Telugu Site icon

మీరు దుబాయ్ వెళ్తున్నారా… అయితే త‌ప్ప‌కుండా ఈ ఫుడ్స్‌ను టేస్ట్ చేయండి…

ప్ర‌పంచంలో అత్యంత అభివృద్ది చెందిన న‌గ‌రాల్లో దుబాయ్ కూడా ఒక‌టి.  దుబాయ్ న‌గ‌రంలో అన్ని రకాల సౌక‌ర్యాలు ఉంటాయి.  ఎడారిలో నిర్మిత‌మైన‌ప్ప‌టికీ నిత్యం ల‌క్ష‌లాది మంది ప‌ర్యాట‌కులు ఆ న‌గ‌రాన్ని వీక్షించేందుకు అక్క‌డికి వ‌స్తుంటారు.  ఈ హైక్లాస్ న‌గ‌రంలో అన్ని ర‌కాల ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండే విధంగా ఆహార‌ప‌దార్థాలు అందుబాటులో ఉంటాయి.  త‌క్కువ ధ‌ర‌కు దొరుకుతున్నాయి క‌దా రుచిగా ఉండ‌వేమో అనుకుంటే పొర‌పాటే.  దుబాయ్ వెళ్లిన వారు త‌ప్ప‌కుండా ఈ ఆహార‌ప‌దార్థాల‌ను టేస్ట్ చేయాల‌ని చెబుతున్నారు.  షావర్మా, రిగాగ్‌, బ‌న్ మ‌స్క్ మ‌సాలా టీ, చికెన్ మోమోన్‌, ఇండియ‌న్ థాలీ, ఫ‌లాఫెల్స్‌, గ‌హ్వా డేట్స్‌, ఒమ‌న్ చిప్స్, మ‌న‌కిష్‌, కునాఫా విత్ క్రీమ్‌, లుకైమ‌త్‌, క‌ర‌క్ చాయ్ వంటివి అక్క‌డ చాలా త‌క్కువ ధ‌ర‌కు దొరుకుతాయి.  త‌క్కువ ధ‌ర‌కు దొరికే ఈ ఆహార‌ప‌దార్థాలు చాలా రుచిక‌రంగా ఉంటాయ‌ని ఫుడ్‌ల‌వ‌ర్స్ చెబుతున్నారు.  

Read: కేర‌ళ‌లో క‌రోనా విల‌యం… ఒక్క‌రోజులో…