Site icon NTV Telugu

Drumstick Tree: మునగ చెట్టు ఇంటి ఆవరణలో ఉండవచ్చా? లేదా? ఉంటే ఏమవుతుంది?

Drumstick Tree

Drumstick Tree

Drumstick Tree: మునగ చెట్టు అనేక విధాలుగా మనకు ఉపయోగకరమైనది. శాస్త్రీయ కోణంలో చూస్తే, ఆరోగ్యపరంగా ఇది అపారమైన విలువ కలిగిన మొక్క. మునగ ఆకులు, కాయలు, పువ్వులు అన్ని విటమిన్ A, C, కాల్షియం, ఐరన్, ప్రోటీన్ లను పుష్కలంగా కలిగి ఉంటాయి. ఇవి అన్ని కూడా రక్తహీనత, కీళ్ల నొప్పులు, కంటి సమస్యలు, జీర్ణకోశ సమస్యల వంటి అనేక సమస్యలకు సహజమైన మందులా పనిచేస్తుంది. అంతేకాకుండా, ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ఇది ఎంతో సహాయపడుతుంది.

పర్యావరణ పరంగా మునగ చెట్టు వేగంగా పెరిగి ఎక్కువ ఆక్సిజన్ విడుదల చేస్తుంది. తక్కువ నీటితోనే జీవించగలగడం వల్ల ఎండ ప్రాంతాల్లో కూడా ఈ చెట్టు సులభంగా పెరుగుతుంది. నేలలోని పోషకాలను పునరుద్ధరించే లక్షణం దీనిలో ఉంది. మరోవైపు ప్రస్తుతం మునగ కాయలు, ఆకులు, పొడి మార్కెట్లో మంచి ధరకు అమ్ముడవుతున్నాయి కూడా. అయితే, మరోవైపు దీని వల్ల కొన్ని నష్టాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉన్నాయి.

Alia Bhatt: అడల్ట్ మూవీలో అలియా భట్

నిజానికి ఈ మునగ చెట్టు వేర్లు పొడవుగా పెరుగుతాయి. కాబట్టి గోడలు, ఫౌండేషన్‌లకు హాని కలిగించే అవకాశం ఉంటుంది. సరైన శుభ్రత పాటించకపోతే పురుగులు పెరిగి పంటలకు హాని కలిగించవచ్చు. అలాగే, ఎక్కువ నీడ అవసరమయ్యే మొక్కల పక్కన మునగ చెట్టు నాటితే వాటి పెరుగుదల తగ్గుతుంది. మరోవైపు వాస్తు కోణంలో మునగ చెట్టును ఇంటి దక్షిణం లేదా పశ్చిమ భాగంలో నాటడం శ్రేయస్కరమని చెబుతారు. ఇది కుటుంబంలో ఆరోగ్యం, శ్రేయస్సు, సంపదకు సంకేతంగా భావిస్తారు.

Humayun’s Tomb collapse: సమాధి చూడటానికి వెళ్తే.. ఢిల్లీలో ఘోరం.. శిథిలాల కింద ఎంత మంది ఉన్నారంటే..?

అంతేకాకుండా, ఇంట్లోని ప్రతికూల శక్తులను తగ్గించి.. సానుకూల శక్తులను పెంచుతుందని నమ్మకం ఉంది. అయితే వాస్తు ప్రకారం కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. మునగ చెట్టును ఉత్తరం లేదా ఈశాన్యం దిశలో నాటకూడదని.. ఒకవేళ అది జరిగితే శుభఫలితాలను తగ్గిస్తుందని నిపుణులు చెబుతారు. అలాగే, ఇంటి ప్రధాన ద్వారం పక్కనే మునగ చెట్టు పెరగడం అనుకూలం కాదని కొందరు విశ్వసిస్తారు. మొత్తం మీద, మునగ చెట్టు శాస్త్రీయంగానూ, వాస్తు కోణంలోనూ ప్రయోజనాలు కలిగిన మొక్క. కానీ దీన్ని సరైన ప్రదేశంలో, సరైన దూరంలో నాటితేనే పూర్తి ప్రయోజనాలు పొందవచ్చు.

Exit mobile version