Site icon NTV Telugu

Breakfast Importance: ఉదయం టిఫిన్‌కు బరువు పెరగడానికి సంబంధం ఏమిటి?

Breakfast

Breakfast

Breakfast Importance: ఈ రోజుల్లో చాలా మంది రాత్రి, పగలు తేడా లేకుండా జీవిస్తున్నారు. ఉద్యోగాల ఒత్తిడి, సరదా మోజు, సోషల్ మీడియా అలవాట్ల కారణంగా చాలా మంది బయోలోజికల్ క్లాక్ (శరీర అంతర్గత గడియారం) దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఉదయం ఆలస్యంగా నిద్ర మేల్కొనడం జరుగుతుందని, ఇది అనేక ఇబ్బందులకు కారణం అవుతుందని చెబుతున్నారు.

READ ALSO: Seediri Appalaraju : హాస్టల్‌ విద్యార్థుల మృతిపై కనీసం కేబినెట్‌లో చర్చించారా.? కనీసం సబ్‌ కమిటీ వేశారా.?

ఉదయం టిఫిన్ చాలా ముఖ్యం..
ఉదయం పోషకాలతో నిండిన ఆరోగ్యకరమైన టిఫిన్ తినడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. పొరపాటున ఉదయం టిఫిన్ మానితే శరీరంలోని చక్కెర స్థాయిలు తగ్గడం, అలసట, బలహీనత, దృష్టి దెబ్బతినడం వంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఉదయం తినే ఆహారం రోజంతా శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. చాలామంది అధిక బరువు ఉన్న వాళ్లు ఉదయం అల్పాహారం మానేస్తారు. కానీ ఇది ప్రమాదం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టిఫిన్ మానిస్తే, ఎక్కువసేపు ఆకలితో ఉండటం వల్ల జీర్ణక్రియ దెబ్బతినడం, మానసిక పరిస్థితులలో మార్పులు, అధిక బరువు పెరగడం వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

ప్రతిరోజూ ఉదయం కచ్చితంగా టిఫిన్ తినడం చాలా ముఖ్యం అని అంటున్నారు. అల్పాహారం శక్తివంతంగా, పోషకాహారంగా ఉండేలా చూసుకోవాలని, దీనివల్ల రోజు అంతా ఉత్సాహంగా ఉండటమే కాకుండా, బరువు పెరగడాన్ని నియంత్రిస్తుందని చెబుతున్నారు. టిఫిన్ మానస్తే శరీర అలసట, మానసిక అసమతుల్యతలను వస్తాయని, కాబట్టి ఉదయం అల్పాహారం మిస్ కాకుండా తినడం ఆరోగ్యానికి, బరువు నియంత్రణకు కీలకం అంటున్నారు.

READ ALSO: Best Banks For Gold Loan: గోల్డ్ లోన్‌పై ఏ బ్యాంక్‌లో తక్కువ వడ్డీ..

Exit mobile version