NTV Telugu Site icon

Aloe Vera Tips: మొటిమలకు గుడ్ బై చెప్పాలంటే.. అలోవెరాతో ఇలా చేయండి

Aloe Vera Skin Benefits

Aloe Vera Skin Benefits

Benefits Of Aloe Vera For Skin: పోషకాహార లోపమే కాదు, వాతావరణంలో వస్తున్న మార్పులు సైతం అందంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మొటిమలు రావడం, చర్మం కందిపోవడం, పొడిబారిపోవడం.. ఇలా ఎన్నో సమస్యలు పట్టి పీడిస్తుంటాయి. అయితే.. ఈ సమస్యలన్నింటినీ ఒక్క అలోవెరాతోనే చెక్ పెట్టొచ్చు. ఇందులో అనేక ఔషద గుణాలు ఉంటాయి. విటమిన్‌ ఏ, సీ, ఈలతో పాటు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది ముఖంపై మొటిమలు, వాటి తాలుకూ మచ్చలను పోగొట్టడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే కాస్మొటిక్స్‌లో అలొవెరాను ఎక్కువగా వాడుతుంటారు. అంతేకాదు.. గాయాలను మాన్పించే గుణాలు, చర్మాన్ని కోమలంగా మార్చే లక్షణాలూ ఉన్నాయి.

Pawan Kalyan: తెలంగాణ ప్రభుత్వానికి పవన్ లేఖ.. ఆ తప్పులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

ఎండకు చర్మం మండినా, కందిపోయినట్లు అనిపించినా.. వెంటనే ఆ ప్రదేశంలో అలోవెరా గుజ్జుని రాస్తే చాలు. క్షణాల్లోనే ఫలితం కనిపిస్తుంది. ఇందులో ఉండే ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్‌ గుణాలు.. చర్మంపై ఏర్పడిన మచ్చలను పోగొడుతాయి. స్నానం చేసే ముందు అలోవెరా గుజ్జును చర్మానికి అప్లై చేసుకొని, 5 నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడుక్కుంటే.. బ్యాక్టీరియా, ఇతరత్రా క్రిములన్నీ చనిపోయి, చర్మం కోమలంగా మారుతుంది. అలోవెరాని తరుచుగా ఉపయోగిస్తే.. చర్మం అందంగా మారుతుంది. స్కిన్‌ కలర్‌ కూడా ఇంప్రూవ్‌ అవుతుంది. వయసు పైబడిన వారు వారానికి మూడుసార్లు క్రమం తప్పకుండా అలోవెరాను రాసుకుంటే.. వృద్దాప్య ఛాయలు తగ్గుతాయి. ప్రతిరోజూ పడుకునే ముందు అలోవెరా జెల్‌ని రాసుకొని, పొద్దునే చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే.. మొటిమల సమస్య తగ్గుతుంది.

Komatireddy Venkat Reddy : రాహుల్‌.. తెలంగాణకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తా అన్నారు

Show comments