ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. అది పెరిగినంత సులువుగా తగ్గదు.. దాంతో జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చాలా మందికి సరైన ఆహారపు అలవాట్లు లేకపోవటం వలన శరీరంలో పెరిగిపోయే ఎక్స్ ట్రా ఫ్యాట్ మన శరీరానికి ఎంతో హాని చేస్తుంది.. ఇలాంటి పరిస్థితి నుంచి బయట పడటానికి చాలా మంది ఆయుర్వేదం వైపు మొగ్గు చూపిస్తున్నారు.. మనం ఈరోజు బెల్లీ ఫ్యాట్ ను న్యాచురల్ పద్దతిలో ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
జీలకర్ర, అల్లంతో తయారు చేసిన డికాషన్ ప్రతిరోజు తీసుకుంటే మన శరీర బరువు తగ్గించుకోవడానికి అది ఒక ఔషధంలా పనిచేస్తుందని అధ్యయనాలు చెపుతున్నాయి. జీలకర్రలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ శక్తిని పెంచుతుంది.. అంతేకాకుండా వ్యాధినిరోధక శక్తిని కూడ పెంచుతుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గించి ఒత్తిడి తగ్గించడమే కాకుండా శ్వాస సంబంధిత సమస్యలను నివారిస్తుంది. జీలకర్ర ఆస్త్మా మరియు శ్వాస సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.. అల్లం జీర్ణ శక్తిని పెంచడం తో పాటు అనేక రకాల సమస్యలను తగ్గిస్తుంది..
బ్లడ్ షుగర్ లెవల్స్ మరియు కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేయడంలో అల్లం ఎంతగానో సహ కరిస్తుంది. ముఖ్యంగా బెల్లీ చుట్టూ ఉన్న ఫ్యాట్ ను బర్న్ చేయడానికి సహాయపడుతుంది. దీనితో ఇన్ని అద్భుత గుణాలు ఉన్న అల్లం మరియు జీలకర్ర డికాషన్ ను తీసుకుంటే మన శరీర బరువు మనకు తెలియకుండానే పూర్తిగా తగ్గి పోతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.. ఈ డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలంటే..ముందుగా ఒక గ్లాస్ నీళ్లలో ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా మరిగించాలి. తర్వాత అందులో ఒక చిన్న అల్లం ముక్క వేసి ఇంకొంచెం సేపు మరిగిస్తే డికాషన్ రెడీ. ఈ డికాషన్ లో తేనే లేదా కొద్దిగా బెల్లం వేసి తాగొచ్చు.. రోజుకు రెండు సార్లు తినక ముందు తాగితే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.