Site icon NTV Telugu

Beauty Tips : అల్లంతో అందమైన చర్మం మీ సొంతం..

Ginger (3)

Ginger (3)

వంటల్లో ఘాటు పెంచే అల్లం గురించి అందరికి తెలుసు.. ఈ అల్లం ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.. అల్లంలో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. చాలా మంది అల్లం టీని, అల్లం రసాన్ని తీసుకుంటూ ఉంటారు. ఏ రూపంలో తీసుకున్నా కూడా అల్లం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చక్కటి ఆరోగ్యాన్ని అందించడంలో అల్లం మనకు ఎంతగానో సహాయపడుతుంది. అయితే కేవలం మన శరీర ఆరోగ్యానికే కాదు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా అల్లం మనకు దోహదపడుతుంది. అల్లాన్ని ఉపయోగించడం వల్ల మనం అనేక రకాల చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు.. అవేంటో ఒకసారి చూద్దాం..

కొందరిలో కళ్ల చుట్టూ ఉబ్బినట్టుగా, ఎర్రగా ఉంటుంది. అలాంటి వారు అల్లం టీ బ్యాగ్ లను ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. టీ తయారు చేసుకున్న తరువాత ఈ టీ బ్యాగ్ లను పడేయకుండా కళ్లపై ఉంచుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు ఉంచడం వల్ల కళ్ల చుట్టూ ఉండే ఉబ్బుదనం తగ్గిపోతుంది. అలాగే మనలో చాలా మంది మొటిమల సమస్యతో బాధపడుతూ ఉంటారు.. అలాంటి వాళ్లు అల్లం రసం లో తేనె కలిపి మొటిమల మీద రాస్తే చాలు అవి త్వరగా తగ్గిపోతాయి..

ఇకపోతే చర్మంపై మచ్చలు ఉన్నవాళ్లు ఒక టీ స్పూన్ అల్లం రసంలో 2 టీ స్పూనల్ పెరుగు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్ లాగా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల చర్మం అందంగా కనబడుతుంది. చర్మం యొక్క రంగు కూడా మెరుగుపడుతుంది. చర్మ సమస్యలను తగ్గించడంలో ఇలా అనేక రకాలుగా అల్లం మనకు దోహదపడుతుంది. అయితే అల్లాన్ని ఉపయోగించడం వల్ల కొందరిలో చర్మంపై దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది.. అందుకే ముందు చర్మం పై ఒక ఐదు నిమిషాలు ఉంచి ఎటువంటి సమస్యలు లేకుంటే అల్లం ఫ్యాక్ లను అప్లై చేసుకోవచ్చు..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Exit mobile version