Site icon NTV Telugu

Health Tips: బాత్రూమ్‌ తలుపు మూసి ఈ పని చేస్తున్నారా! అయితే డేంజర్‌..

Bathroom Cleaning

Bathroom Cleaning

Health Tips: బాత్రూమ్‌లో చేసే పొరపాట్లు ప్రాణాలను ప్రమాదంలో పడేస్తాయని ఎవరు అనుకోరు. నిజానికి చాలా మంది వాళ్ల బాత్రుమ్‌ను శుభ్రపరచడంలో తెలియకుండా చేసే చిన్న పొరపాటు వారి ఆరోగ్యానికి పెద్ద ప్రమాదాన్ని కలిగిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిజానికి చాలా మంది ప్రజలు వారి బాత్రుమ్‌లను శుభ్ర పరిచేటప్పుడు తలుపులు, కిటికీలను మూసివేస్తారు. అయితే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తలుపులు, కిటికీలను పూర్తిగా మూసివేసి బాత్రూమ్ శుభ్రం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. రసాయన క్లీనర్లను ఉపయోగిస్తే ఈ ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉంటుదని అంటున్నారు. బాత్రూమ్ డోర్ క్లోజ్ చేసి శుభ్రం చేసే టైంలో అందులో విష వాయువులు వేగంగా పేరుకుపోతాయని, ఇది ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందని అంటున్నారు.

READ ALSO: Rahul Gandhi: BMW ప్లాంట్‌ను సందర్శించిన రాహుల్ గాంధీ.. వీడియో షేర్

ఫినాల్, బ్లీచింగ్ పౌడర్, యాసిడ్ క్లీనర్ల వంటి బాత్రూమ్ క్లీనింగ్ ఉత్పత్తులు హానికరమైన రసాయనాలను కలిగి ఉంటాయని పేర్కొన్నారు. వీటిని వాడటం వల్ల విషపూరిత వాయువులు గాలిలోకి విడుదలవుతాయని, ఆ టైంలో బాత్రూమ్ తలుపులు మూసివేస్తే ఈ వాయువులు ఆ గది లోపల పేరుకుపోతాయని వెల్లడించారు. వాటిని పీల్చడం వల్ల గది శుభ్రం చేసే వ్యక్తిపై తీవ్రమైన ప్రభావాలు ఉంటాయని హెచ్చరించారు. ఎక్కువ విష వాయువులను పీల్చుకుంటే, అవి ఊపిరితిత్తులకు నేరుగా హాని కలిగిస్తాయని చెప్పారు.

దీర్ఘకాలంలో ఇది ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, అలెర్జీలు, ఉబ్బసం వంటి అనారోగ్య సమస్యలను పెంచుతుందని వెల్లడించారు. బాత్రూమ్ శుభ్రం చేసే ముందు, తలుపులు, కిటికీలను వెడల్పుగా తెరవాలని సూచించారు. బాత్రూంలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటే, దానిని ఆన్ చేయాలని చెప్పారు. ఇది విష వాయువులను తొలగించడానికి, గదిలోకి స్వచ్ఛమైన గాలిని ప్రసరింప చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే బాత్రూమ్ క్లీన్ చేసే టైంలో మాస్క్, చేతి గ్లౌజ్‌లు ధరించాలని చెబుతున్నారు.

READ ALSO: Yashasvi Jaiswal: ఆస్పత్రిలో చేరిన టీమిండియా క్రికెటర్..

Exit mobile version