ఈ రోజుల్లో పిల్లలకు చెప్పులు కొనుగోలు చేసే సమయంలో చాలా మంది తల్లిదండ్రులు క్రోక్స్ (Crocs) ను ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నారు. ఎందుకంటే కలర్ ఫుల్ గా.. తేలికపాటి డిజైన్, తొడగడానికి సౌలభ్యం వంటి కారణాల వల్ల అవి పిల్లలకు సరిపోతాయని భావిస్తుంటారు. వీటిని రోడ్లపై, మాల్స్‌లో, స్విమ్మింగ్ పూల్స్‌లో చాలా మంది ధరిస్తున్నారు. సౌకర్యం, స్టైల్ కారణంగా క్రోక్స్ బెస్ట్ అప్‌షాన్ అవుతున్నాయి.. పిల్లల ఆరోగ్య పరంగా ఇవి తగిన ఎంపిక కాదని నిపుణులు చెబుతున్నారు.
Also Read : Kannappa : ‘కన్నప్ప’ ఓటీటీ రిలీజ్ డేట్ ..?
క్రోక్స్ ప్రత్యేకమైన డిజైన్ వలన పాదాలకు సరైన మద్దతు ఇవ్వడం జరగదు. పిల్లల పాదాలు అభివృద్ధి చెందే దశలో ఉండే సమయంలో, గట్టి మద్దతు అవసరం. కానీ క్రోక్స్ వాడటం వలన పాదాల ఆకృతి మర్చిపోవడం, చదునైన పాదాలు, కాలి నొప్పులు వంటి సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా వీటిలో ఉన్న వెనుక పట్టీ వల్ల, పిల్లలు వేళ్లను వంచేలా నడవడం, అలసట, గాయాలకు దారి తీస్తుంది. అంతే కాదు, వీటి వదులుగా ఉండే నిర్మాణం వల్ల పిల్లలు పరిగెత్తేటప్పుడు, ఆడేటప్పుడు చెప్పులు జారి పడిపోవచ్చు. అలాగే క్రోక్స్‌లో ఉన్న వెనుక పట్టీ వలన పిల్లలు తరచుగా కాలి వేళ్లను వంచి.. పాదాలను గట్టిగా పెట్టడం వలన అలసట, నొప్పులు వస్తాయి. ఇలా క్రోక్స్ ఒక పాదరక్ష గా సౌకర్యవంతమైనదిగా కనిపించినప్పటికీ.. ఇది పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదు. పిల్లలకు మంచి గ్రిప్, సపోర్టు ఉన్న చెప్పులు ధరించడం వల్లనే వారి పాదాలు సరిగా అభివృద్ధి చెందుతాయి..
