NTV Telugu Site icon

Fish Curry : గుమగుమాలాడే చేపల పులుసును ఇలా చేసుకోండి.. మొత్తం ఖాళీ చేస్తారు..

Fish Curry

Fish Curry

చేపలు ఆరోగ్యానికి చాలా మంచివి.. అందుకే చాలా మంది చేపలను చేసుకొని తింటారు..చేపలతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. అందులో చేపల పులుసు కూడా ఒకటి.. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా చేపల పులుసు చేస్తారు.. మనం ఈరోజు ఆంధ్రా స్టైల్లో ఇప్పుడు చేపల పులుసు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చేసుకుందాం..

కావలసిన పదార్థాలు :

చేప ముక్కలు – కిలో,

ఉప్పు – ఒక టీ స్పూన్,

కారం – ఒక టీ స్పూన్,

పసుపు – అర టీ స్పూన్,

ఎండుమిర్చి -1,

ధనియాలు – 2 టీ స్పూన్స్,

జీలకర్ర – ఒక టీ స్పూన్,

మిరియాలు – 7,

లవంగాలు – 4,

మెంతులు – పావు టీ స్పూన్,

దాల్చిన చెక్క – ఒక చిన్న ముక్క,

ఉల్లిపాయ – పెద్దది ఒకటి,

వెల్లుల్లి రెబ్బలు – 10,
అల్లం – ఒక ఇంచు ముక్క,

పచ్చి కొబ్బరి ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్,

నూనె – ముప్పావు కప్పు,

ఆవాలు – అర టీ స్పూన్,

చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 4,

తరిగిన పచ్చిమిర్చి – 10,

కరివేపాకు – రెండు రెమ్మలు,

నానబెట్టిన చింతపండు – పెద్ద నిమ్మకాయంత,

తరిగిన కొత్తిమీర – కొద్దిగా..

తయారీ విధానం :

చేప ముక్కలను పసుపు, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలి..తరువాత ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి అర గంట పాటు పక్కకు ఉంచాలి. తరువాత తరువాత కళాయిలో ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, లవంగాలు, మెంతులు, దాల్చిన చెక్క వేసి దోరగా వేయించాలి. తరువాత వీటిని జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి.ఆ తరువాత అదే జార్ లో పెద్ద ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి ముక్కలు వేసి తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. దీనిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత తగినంత ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలపాలి.. ఆ తర్వాత బాగా కలపాలి.. చేప ముక్కలు వేసి అలా ఒక నిమిషం పాటు అలాగే ఉంచిన తరువాత మరో వైపుకు నెమ్మదిగా తిప్పుకోవాలి. వీటిని మరో నిమిషం పాటు ఉడికించిన తరువాత చింతపండు రసం, ఒక కప్పు నీళ్లు పోసుకోవాలి. 2 నిమిషాల పాటు ఉడికించాలి. పులుసు ఉడుకు పట్టిన తరువాత మంటను చిన్నగా చేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న మసాలా పొడి, మరో 5 పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు వేసి నెమ్మదిగా కలపాలి. తరువాత దీనిని మరో 5 నిమిషాల పాటు ఉడికించి స్టప్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర చల్లుకోవాలి.. అంతే రుచికరమైన చేపల పులుసు రెడీ.. మీరు ట్రై చెయ్యండి..

Show comments