Chicken Pachadi: ముక్క గట్టిపడదు.. ఆరు నెలలైన అస్సలు పాడవదు! చికెన్ పచ్చడి పక్కా కొలతలతో సీక్రెట్ రెసిపీ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chicken Pachadi: నాన్‌వెజ్ లవర్స్‌కు చికెన్ పచ్చడి అంటే ఉండే ఇష్టమే వేరు. మరి అదే చికెన్ ఎప్పుడూ అందుబాటులో ఉండేలా ఘాటైన పచ్చడి రూపంలో ఉంటే, ఊహించుకుంటేనే నోట్లో నీళ్లూరుతున్నాయి కదూ. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసి, ముక్కలతో పాటు ఆ చికెన్ పచ్చడి గ్రేవీని కలిపి ముద్ద నోట్లో పెట్టుకుంటే.. స్వర్గం కనిపిస్తుంది. బ్యాచిలర్స్కైనా, హాస్టల్ పిల్లలకైనా, ఇంట్లో ఎప్పుడు ముద్ద దిగాలన్నా ఈ చికెన్ పచ్చడి ఉంటే ప్లేటు ఖాళీ కావాల్సిందే. అయితే చాలామందికి పచ్చడి పెట్టిన కొన్ని రోజులకే ముక్క గట్టిగా రబ్బరులా అయిపోవడం లేదా బూజు పట్టడం లాంటి సమస్యలు వస్తుంటాయి. అలా కాకుండా ముక్కలు గట్టిపడకుండా, పక్కా కొలతలతో, ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ఇంట్లోనే ఎంతో రుచికరమైన ఈ చికెన్ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
బోన్‌లెస్ చికెన్: 1 కేజీ (మీడియం సైజ్ ముక్కలు)
Also Read
- World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
- CDSCO: పదేపదే ట్యాబ్లెట్లు వాడుతున్నారా?
- Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ 'వెజ్ కీమా'.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
- Guest Habits: గెస్ట్‌గా వెళ్తున్నారా? పిలిచినవారు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
పసుపు: 1/2 టీస్పూన్
ఉప్పు: 1 టీస్పూన్ (ఉడికించడానికి), పావు కప్పు (40 గ్రాములు – పచ్చడి కోసం)
నూనె: 1/2 టేబుల్ స్పూన్ (ఉడికించడానికి), 200 – 250 ml (నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 3 టేబుల్ స్పూన్లు (60 గ్రాములు – ఫ్రెష్‌గా దంచినది)
కారం (పచ్చి కారం): 1/2 కప్పు (50 నుండి 60 గ్రాములు)
నిమ్మరసం: 4 మీడియం సైజ్ నిమ్మకాయల రసం (40 – 50 ml)
మసాలా పొడి కోసం..
దాల్చిన చెక్క (2 ఇంచులు), యాలకులు (3), లవంగాలు (6)
ధనియాలు (2 టేబుల్ స్పూన్లు), ఆవాలు (1 టేబుల్ స్పూన్), మెంతులు (1/2 టేబుల్ స్పూన్), జీలకర్ర (1/2 టేబుల్ స్పూన్)
తయారీ విధానం ఇదే..
ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలను లో-ఫ్లేమ్‌లో వేయించాలి. తర్వాత ధనియాలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసి కమ్మటి వాసన వచ్చేవరకు డ్రై రోస్ట్ చేసి చల్లార్చాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. అనంతరం క్లీన్ చేసిన చికెన్ ముక్కలను ఒక మందపాటి కడాయిలోకి తీసుకుని, అందులో పసుపు, ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసి కలపాలి. తర్వాత నీళ్లు పోయకుండా మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో ఉడికించాలి. చికెన్ నుంచి ఊరిన నీరంతా పూర్తిగా ఎగిరిపోయే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
మరో పాన్‌లో 200-250 ml నువ్వుల నూనె వేసి వేడి చేయాలి. ఇందులో ఉడికించిన చికెన్ ముక్కలను వేసి మీడియం ఫ్లేమ్‌లో లైట్ గోల్డెన్ కలర్ – క్రిస్పీగా అయ్యే వరకు వేయించాలి. ముక్కలు వేగాక, అందులోనే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా 5 నిమిషాల పాటు లో – ఫ్లేమ్‌లో వేయించి స్టవ్ ఆపేయాలి. స్టవ్ పైనుంచి దించిన కడాయి వేడిగా ఉన్నప్పుడే గ్రైండ్ చేసిన మసాలా పొడి, ఎండబెట్టి పొడి చేసిన కల్లుప్పు (లేదా డ్రై రోస్ట్ చేసిన ఉప్పు) పచ్చి కారం వేసి బాగా కలపాలి. పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మరసం పిండుకుని బాగా కలుపుకోవాలి.
నిల్వ ఉంచుకునే విధానం
తయారైన పచ్చడిని ఒక గాజు సీసాలో భద్రపరుచుకుని 2 రోజుల పాటు ఊరనివ్వాలి. మధ్యలో ఒకటి రెండు సార్లు కలుపుతుండాలి. రెండు రోజుల తర్వాత నూనె పైకి తేలి ముక్కలకు మసాలా బాగా పట్టి నోరూరించే చికెన్ పచ్చడి రెడీ అవుతుంది. ఈ పచ్చడిని ఫ్రిజ్‌లో పెడితే 4 నుంచి 5 నెలల వరకు, బయట ఉంచితే 2 నుంచి 3 నెలల వరకు పాడవకుండా నిల్వ ఉంటుంది. దీనిని వేడి వేడి అన్నంలోకే కాకుండా దోశ, ఇడ్లీ వంటి టిఫిన్స్‌తో కూడా ఆస్వాదించవచ్చు.
తాజావార్తలు
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
Varanasi : రికార్డ్ ధర పలుకుతున్న వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్.. పోటీలో మైత్రి, దిల్ రాజు, నాగవంశీ
-
AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
-
Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
ట్రెండింగ్
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!