Pregnancy: గర్భిణులకు “కాస్మెటిక్స్” ముప్పు.. కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు
- గర్భిణులపై కాస్మోటిక్స్ ప్రతికూల ప్రభావం..
- ఎయిమ్స్ పరిశోధనల్లో షాకింగ్ విషయాలు..
- శిశువు ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pregnancy: మహిళకు గర్భధారణ సమయంలో సౌందర్య సాధనాలు ప్రమాదం తెస్తున్నాయని లేటెస్ట్ సర్వే వెల్లడించింది. కాస్మెటిక్స్, ప్లాస్టిక్ ఉత్పత్తులు, కొన్ని పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ వినియోగంపై ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS), న్యూఢిల్లీ నిర్వహించిన తాజా అధ్యయనం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఉత్పత్తుల్లో ఉండే కొన్ని రసాయనాలు గర్భిణుల శరీరంలో పెరుగుతున్నాయని, అవి తల్లి గర్భంలో శిశువు ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం చూపించే అవకాశం ఉందని హెచ్చరించింది.
641 మంది ఆరోగ్యవంతమైన గర్భిణులను పరిశీలించిన ఈ పరిశోధనలో.. గర్భధారణలోని వివిధ దశల్లో వారి మూత్ర నమూనాలను సేకరించి పరీక్షించారు. ఇందులో మిథైల్పారాబెన్ (Methylparaben), మోనోఎథైల్ ఫాలేట్ (Monoethyl Phthalate) అనే రసాయనాల స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. మిథైల్ పారాబెన్ అనేది కాస్మోటిక్స్, స్కిన్ కేర్ ఉత్పత్తుల్లో, లోషన్లు, షాంపూల్లో వాడే ఒక ప్రిజర్వేటివ్. మోనోఎథైర్ ఫాలేట్ ప్లాస్టిక్ వస్తువుల్లో, కృత్రిమ సువానన తయారీలో ఉపయోగిస్తారు. ఈ రెండు రసాయనాలను ‘‘ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్’’గా గుర్తించారు. ఇది శరీరంలో హార్మోన్ల పనితీరు ప్రభావితం చేసే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Also Read
- వనస్థలిపురంలో ఘనంగా ప్రారంభమైన CMR షాపింగ్ మాల్
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
గర్భధారణ సమయంలో ముఖ్యంగా 4-6 నెలల మధ్య రెండో త్రైమాసికంలో ఈ రసాయన స్థాయిలు అత్యధికంగా ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. ఇదే సమయంలో శిశువు అవయవాలు, శరీర భాగాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. ఈ దశలో హార్మోన్లను ప్రభావితం చేసే రసాయనాల ప్రభావం భవిష్యత్తులో శిశువు ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపించే అవకాశం ఉందని ఎయిమ్స్ పరిశోధకులు చెబుతున్నారు. తక్కువ బరువుతో శిశువు జననం, తక్కువ పొడవు, విటమిన్ -డి స్థాయిలు కూడా తగ్గినట్లు పరిశోధనల్లో గుర్తించారు. అయితే, గర్భిణులపై కాస్మోటిక్స్ ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి మరిన్ని పరిశోధనలు అవసరమని నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు.. సీఎం చంద్రబాబు నాయుడు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!