NTV Telugu Site icon

Archana Kochchar: ఫ్యాషన్ షోలో తుళ్లిపడ్డ అర్చన కొచ్చర్.. ఆ తర్వాత ఏం చేసిందంటే..!

Goldarchanakochchar

Goldarchanakochchar

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అర్చన కొచ్చర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఫ్యాషన్ షో వేదికపై అర్చన కొచ్చర్ వాక్ చేస్తుండగా సడన్‌గా డ్రస్ చెప్పుల్లో ఇరుక్కుని తుళ్లిపడబోయింది. వెంటనే తేరుకుని చెప్పులు విసిరేసి వాక్ కొనసాగించింది. పింక్, గోల్డ్ లెహంగాలో అర్చన కొచ్చర్ మెరిసిపోయింది. స్టైల్‌గా స్టేజీపై వస్తుండగా హఠాత్తుగా కాలు మడమ కిందకు డ్రస్ వెళ్లడంతో తుళ్లిపడబోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెప్పులు విసిరేసి ర్యాంప్‌పై వాక్ కొనసాగించింది. ఈ వీడియోపై పలువురు రకరకాలైన కామెంట్లు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Pista benefits: పిస్తాతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..!

అర్చన కొచ్చర్ భారతీయ ఫ్యాషన్ డిజైనర్. గ్లోబల్ డిజైన్ సెన్సిబిలిటీలకు ప్రసిద్ధి చెందింది. జాతీయ, అంతర్జాతీయ ర్యాంప్‌లపై ప్రదర్శనలు ఇస్తుంటారు. లాక్మే ఫ్యాషన్ వీక్ , ఇండియా ఫ్యాషన్ వీక్, న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ వంటి కార్యక్రమాలతో కొచర్ తన డిజైన్లను ప్రదర్శించారు. ముంబైలో జరిగిన ఇండియన్ అఫైర్స్ 6వ వార్షిక ఇండియా లీడర్‌షిప్ కాన్క్లేవ్ 2015లో సత్య బ్రహ్మ చొరవతో మహిళా సాధికారత కోసం కమ్యూనిటీలో ఉపాధిని కల్పించే లక్ష్యంతో మేక్ ఇన్ ఇండియా నడిచే అహింస పట్టు చీరను అర్చన ప్రదర్శించారు.

Show comments