AC Health Risks: ఈ రోజుల్లో కార్పొరేట్ ఆఫీసులలో, షాపింగ్ మాల్స్, ఇళ్లలో ఏసీల వాడకం చాలా సాధారణంగా మారిపోయింది. వేడి నుంచి తాత్కాలిక ఉపశమనం కోసం ఏసీలు తప్పనిసరి అనిపిస్తున్నా, దీని వెనక దాగి ఉన్న ప్రమాదాలపై చాలా మందికి స్పష్టత లేదు. వైద్య నిపుణుల మాటల ప్రకారం.. ఏసీ గదుల్లో ఎక్కువసేపు గడపడం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. ఏసీలతో మృత్యుఘంటికలు మూగడంపై నిపుణులు ఏం చెబుతున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: School Life Movie: పులివెందుల యూట్యూబర్ హీరోగా సినిమా.. ఆరోజే రిలీజ్ !
ఇన్ఫెక్షన్ల ముప్పు: ఏసీ గదుల్లో గాలి తిరుగుతుంది కానీ బయట నుంచి ఫ్రెష్ ఎయిర్ వచ్చేది కష్టం. ఇది గదిలో వ్యాధికారక క్రిములు, ధూళి, తుంపరలు ఎక్కువసేపు ఉండేలా చేస్తుంది. దీంతో శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్ల బారినపడే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
తలనొప్పులు: ఎక్కువసేపు ఏసీలో ఉంటే కొందరికి తలనొప్పి, మతిమరుపు, తల తిరిగిన భావన వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇది ముఖ్యంగా గదిలో తగినంత ఆక్సిజన్ లభించకపోవడం వల్ల జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
డీహైడ్రేషన్: ఏసీలు గదిలోని తేమను వెలుపలికి పంపిస్తాయి. దీనివల్ల శరీరంలోని ద్రవాల వినియోగం పెరిగి డీహైడ్రేషన్‌కు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఏసీ గదుల్లో పనులు చేసే వాళ్లు నీరు తగినంతగా తాగకపోతే, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని హెచ్చరిస్తున్నారు.
శ్వాస సంబంధిత సమస్యలు: ఏసీ గాలి అనేది సాధారణ గాలికంటే తక్కువ తేమ కలిగి ఉంటుంది. ఇది వాతావరణాన్ని శుష్కంగా మార్చి శ్వాసకోశాలకు ఇబ్బంది కలిగిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ పరిస్థితి తీవ్రమై శ్వాస ఆడక, మృత్యువుకూ కారణమయ్యే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఏసీ వల్ల చల్లదనం అనుభూతి కలిగినా, అది తాత్కాలికమే అని నిపుణులు చెబుతున్నారు. ఏసీల చల్లదనం ఫలితంగా శరీరానికి సహజమైన ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థ దెబ్బతినే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలంగా ఏసీలో గడిపే అలవాటు ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా చేస్తుందని చెబుతున్నారు.
ఏసీ గదుల్లో ఉండే వారు వీటిని ట్రై చేయండి..
1. ఏసీ గదుల్లో మితంగా ఉండాలి.
2. తరచూ గది గాలి మార్చడం అవసరం.
3. శరీరానికి తగినంత నీరు అందేలా చూసుకోవాలి.
4. ఏసీ ఫిల్టర్లను నియమితంగా శుభ్రపరచాలి.
5. మోస్తరు ఉష్ణోగ్రత (24°C–26°C) వద్ద ఏసీ ఉపయోగించాలి.
READ ALSO: Rajasthan Honeytrap Case: రాజస్థాన్‌లో ISI గూఢచారి అరెస్ట్.. రెండేళ్లుగా ఆర్మీ రహస్య సమాచారం లీక్..
