SSC GD 2026: అభ్యర్థులకు అలర్ట్.. SSC GD కానిస్టేబుల్ రాత పరీక్ష తేదీ మార్పు.. కొత్త ఎగ్జామ్ డేట్ ఇదే
- SSC GD కానిస్టేబుల్ రాత పరీక్ష తేదీ మార్పు
- ముందుగా మే 28, 2026న నిర్వహించాల్సిన పరీక్షను ఒక రోజు ముందుకు
- మే 27, 2026న నిర్వహించనున్నట్లు SSC అధికారికంగా ప్రకటించింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న SSC GD కానిస్టేబుల్ 2026 పరీక్షకు సంబంధించిన కీలక అప్డేట్ విడుదలైంది. ముందుగా మే 28, 2026న నిర్వహించాల్సిన పరీక్షను ఒక రోజు ముందుకు జరిపి మే 27, 2026న నిర్వహించనున్నట్లు SSC అధికారికంగా ప్రకటించింది.
ఎందుకు పరీక్ష తేదీ మార్చారు?
Also Read
- Indian Navy SSC Officer Recruitment 2026: భారత నావికాదళంలో 275 SSC ఆఫీసర్ పోస్టులు.. అర్హత, ఎంపిక విధానం వివరాలు
- TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
- TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!
- BOI Credit Officer Recruitment 2026: 779 పోస్టులకు దరఖాస్తుల ప్రారంభం.. అర్హత, జీతం, ఎంపిక విధానం పూర్తి వివరాలు
ఇద్-ఉల్-జుహా (బక్రీద్) సెలవు తేదీలో కేంద్ర ప్రభుత్వం చేసిన మార్పుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు SSC వెల్లడించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT) జారీ చేసిన సవరించిన సెలవు ఉత్తర్వుల మేరకు పరీక్ష తేదీని ముందుకు జరిపినట్లు తెలిపింది.
కొత్త పరీక్ష తేదీ ఇదే
పాత తేదీ: మే 28, 2026
సవరించిన తేదీ: మే 27, 2026
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ కొత్త అడ్మిట్ కార్డులను తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాలని SSC సూచించింది. కొత్త అడ్మిట్ కార్డులు పరీక్షకు 2-3 రోజుల ముందు అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి వస్తాయని తెలిపింది.
సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై జాగ్రత్త
పరీక్ష తేదీలకు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న అనధికారిక సమాచారం నమ్మవద్దని SSC హెచ్చరించింది. అభ్యర్థులు కేవలం అధికారిక వెబ్సైట్, అధికారిక నోటీసుల ద్వారా మాత్రమే సమాచారం తెలుసుకోవాలని సూచించింది.
పరీక్ష వివరాలు
SSC GD కానిస్టేబుల్ 2026 నియామక ప్రక్రియ ద్వారా CAPFs, SSF, అస్సాం రైఫిల్స్‌లో మొత్తం 25,487 పోస్టులను భర్తీ చేయనున్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) ప్రస్తుతం ఏప్రిల్ 27 నుంచి మే 30 వరకు వివిధ దశల్లో నిర్వహించనున్నారు. అభ్యర్థులు తాజా అప్డేట్స్ కోసం అధికారిక SSC వెబ్‌సైట్‌ను పరిశీలిస్తూ ఉండాలని అధికారులు సూచించారు.
తాజావార్తలు
-
Iran: ఖమేనీ శవపేటికకు ఫైటర్ జెట్లలో పహారా..
-
Ponnam Prabhakar : వర్షాకాలం.. బస్తీ దవాఖానలపై ప్రభుత్వం అలర్ట్
-
El Nino: ఎల్‌నినోతో వర్షాలుండవన్నారు.. ఇప్పుడెందుకు భారత్‌ను ముంచెత్తున్నాయి.. కారణమేంటి?
-
TMC: సొంత డబ్బులతో విమానం కొని, దానికే అద్దె చెల్లించారు.. తృణమూల్ స్కాంతో ఈడీ షాక్..
-
Viral Video : “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా”.. మనవడితో సీఎం రేవంత్ రెడ్డి మధుర క్షణాలు
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!