బ్యాంకింగ్ సెక్టార్ లో స్థిరపడాలనుకునే వారికి గుడ్ న్యూ్స్. ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7,150 ఖాళీ అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణ మే 19న ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు అప్రెంటిస్‌షిప్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో లేదా ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు ఫారమ్‌ను పూరించవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 8, 2026.
అర్హత
అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అదనంగా, ఏప్రిల్ 1, 2026 నాటికి అభ్యర్థి కనీస వయస్సు 20 సంవత్సరాల కంటే తక్కువ కాకుండా, 28 సంవత్సరాల కంటే ఎక్కువ కాకుండా ఉండాలి. అయితే, వర్తించే నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీలకు వయో సడలింపు ఉంటుంది. స్థానిక భాష (ఎంచుకున్న రాష్ట్రం లోకల్ లాంగ్వేజ్)లో చదవడం, రాయడం, మాట్లాడడం, అర్థం చేసుకోవడం తెలిసి ఉండాలి.
దరఖాస్తు రుసుము
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల అభ్యర్థులు దరఖాస్తు ఫారంతో పాటు రూ.300 దరఖాస్తు ఫీజును సమర్పించాల్సి ఉంటుంది. ఈ రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వర్గాల అభ్యర్థులకు ఉచితం.
ఎంపిక ప్రక్రియ
ఈ నియామకానికి ఎంపిక కావాలంటే, మీరు ముందుగా రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. అభ్యర్థులు ఆ తర్వాత స్థానిక భాషా పరీక్ష, పత్రాల ధృవీకరణ, వైద్య పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.15,000 స్టైఫండ్ అందిస్తారు.
