Results : ఆర్‌ఆర్‌బీ ALP CBT-2 ఫలితాలు విడుదల.. ఆప్టిట్యూడ్ టెస్ట్ జులై 15న
- CBT 2 ఫలితాలు విడుదల
- జులై 7 వరకు స్కోర్‌కార్డులు డౌన్‌లోడ్
- అర్హత మార్కుల ప్రకారం జులై 15న ఆప్టిట్యూడ్ టెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Results : రైల్వే లోకో పైలట్ (RRB ALP) 2024 సీబీటీ–2 పరీక్ష ఫలితాలను బుధవారం (జులై 2) రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులు RRB అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో ఫలితాలు చూసుకోవచ్చు. అలాగే జులై 2 నుంచి 7వ తేదీ వరకు స్కోర్‌కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
కటాఫ్ మార్కులు ఇలా ఉన్నాయి:
Also Read
- SSC Memos: మార్చి, జూన్ 2026 పరీక్షల్లో పాసైన ‘పది’ విద్యార్థులకు అలర్ట్.. రేపు సర్టిఫికేట్ల పంపిణీ..
- India Post GDS : పదో తరగతితో పోస్ట్ఆఫీస్ జాబ్.. 25 వేలకుపైగా పోస్టులు
- Onkar Batra: 7ఏళ్లకే వెబ్‌సైట్.. 20ఏళ్లకే శాటిలైట్.. కశ్మీర్ యువకుడి సక్సెస్ స్టోరీ!
- Reservation Roster: డాక్టర్ల నియామకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం!
- ఓపెన్ కేటగిరీ: 62.96297
- ఎస్సీ: 30
- ఎస్టీ: 35.18519
- ఓబీసీ: 50.37037
- ఈడబ్ల్యూఎస్: 42.59259
- ఎక్స్ సర్వీస్‌మెన్: 47.77778
ఈ కటాఫ్ మార్కుల ఆధారంగా అర్హత పొందిన అభ్యర్థులకు జులై 15న ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు బోర్డు ప్రకటించింది.
18,799 ALP ఖాళీల భర్తీ ప్రక్రియలో భాగంగా…
దేశవ్యాప్తంగా రైల్వే జోన్లలో 18,799 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ కోసం ఆర్‌ఆర్‌బీ ఈ నియామక ప్రక్రియను చేపట్టింది. ఇందులో సికింద్రాబాద్ రైల్వే జోన్‌లో 2,528 పోస్టులు ఉన్నాయి.
NTPC గ్రాడ్యుయేట్ పోస్టులపై ప్రాథమిక కీ విడుదల
ఇంతేకాక, ఆర్‌ఆర్‌బీ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధించి ఇటీవల నిర్వహించిన CBT-1 పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీ కూడా విడుదల చేసింది. అభ్యర్థులు తమ ప్రశ్నపత్రం, రెస్పాన్స్ షీట్‌లను వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. ప్రాథమిక కీపై అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి జులై 6 వరకు అవకాశం ఉంది. అభ్యంతరానికి రూ.50 ఫీజుతో పాటు సరైన ఆధారాలు అందజేయాల్సి ఉంటుంది.
దేశవ్యాప్తంగా 11,558 పోస్టుల భర్తీకి ప్రక్రియ
ఈసారి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు మొత్తం 11,558 NTPC పోస్టుల భర్తీకి ప్రక్రియ ప్రారంభించింది. ఇందులో 8,113 గ్రాడ్యుయేట్, 3,445 అండర్‌గ్రాడ్యుయేట్ పోస్టులు ఉన్నాయి.
రిజల్ట్ లింక్ : https://www.rrbapply.gov.in
తాజావార్తలు
-
SSC Memos: మార్చి, జూన్ 2026 పరీక్షల్లో పాసైన ‘పది’ విద్యార్థులకు అలర్ట్.. రేపు సర్టిఫికేట్ల పంపిణీ..
-
Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
-
CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
-
Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
-
Veligonda Project : వెలిగొండ నిర్వాసితులకు బిగ్ గుడ్ న్యూస్.. చంద్రబాబు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!