RBI Young Professionals Recruitment 2026: ఆర్బీఐలో జాబ్స్.. నెలకు రూ.1.5 లక్షల స్టైపెండ్.. అర్హతలు, దరఖాస్తు వివరాలివే
- యువతకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) శుభవార్త
- నెలకు రూ.1.5 లక్షల స్టైపెండ్
- అభ్యర్థులు 2026 జూలై 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతిష్టాత్మక సంస్థలో పని చేయాలనే కల ఉన్న యువతకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) శుభవార్త చెప్పింది. అత్యంత ప్రతిభావంతులైన యువ నిపుణులను ఎంపిక చేసేందుకు RBI Young Professionals (YP) Recruitment 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1.50 లక్షల స్టైపెండ్ అందించనుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు 2026 జూలై 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్థిక రంగం, టెక్నాలజీ, పరిశోధన విభాగాల్లో కెరీర్‌ను నిర్మించుకోవాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.
మొత్తం ఖాళీలు ఎన్ని?
ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 12 యంగ్ ప్రొఫెషనల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు ముంబైలోని ఆర్బీఐ సెంట్రల్ ఆఫీస్ విభాగాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
Also Read
- Government Jobs: 7,390 ప్రభుత్వ ఉద్యోగాలు, నెలకు రూ. 2 లక్షల వరకు జీతం.. పూర్తి వివరాలివే!
- RRB NTPC Recruitment: రైల్వేలో 1688 క్లర్క్, టికెట్ కలెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నేడే చివరి తేదీ.! అప్లై చేసుకున్నారా.?
- Layoffs: లేఆఫ్స్ బాటలో డిస్నీ.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ పోటీ తట్టుకోలేక కీలక నిర్ణయం..
- November School Holidays: ఈనెలలో భారీగా సెలవులు.. ఏకంగా 8 నుంచి 13 రోజులు పాఠశాలలకు హాలిడేస్..
ఏఏ విభాగాల్లో అవకాశాలు?
ఈ నియామకాలు పలు ప్రత్యేక రంగాల్లో నిర్వహించనున్నారు. వాటిలో సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్వాంటమ్ టెక్నాలజీ, డేటా అనలిటిక్స్, ఫైనాన్షియల్ మార్కెట్స్, క్లైమేట్ రిస్క్ & సస్టైనబుల్ ఫైనాన్స్, పాలసీ రీసెర్చ్, పేమెంట్ సిస్టమ్స్ వంటి విభాగాలు ఉన్నాయి.
స్టైపెండ్ ఎంత?
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1,50,000 ఫిక్స్డ్ స్టైపెండ్ చెల్లించబడుతుంది. అయితే, దీనిపై వర్తించే పన్ను మినహాయింపులు ఉంటాయి.
వయోపరిమితి
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2026 జూలై 6 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
విద్యార్హతలు
పోస్టును బట్టి అర్హతలు మారుతూ ఉంటాయి. సాధారణంగా సంబంధిత విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్డీ సమాన అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను పరిశీలించాలని ఆర్బీఐ సూచించింది.
ఉద్యోగ కాలపరిమితి
ఈ నియామకం పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉంటుంది.
ప్రారంభ ఒప్పంద కాలం: 3 సంవత్సరాలు
పనితీరు ఆధారంగా గరిష్టంగా 5 సంవత్సరాల వరకు పొడిగించే అవకాశం ఉంటుంది.
దరఖాస్తు విధానం
అభ్యర్థులు ఈ-మెయిల్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు కోసం అవసరమైన పత్రాలు:
పూర్తిగా నింపిన అప్లికేషన్ ఫారం
కరికులమ్ విటే (CV)
విద్యార్హతల సర్టిఫికెట్లు
స్టేట్మెంట్ ఆఫ్ ఇంటరెస్ట్
రిఫరెన్స్ లెటర్
ఇతర అవసరమైన పత్రాలు
పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్లో చూడవచ్చు.
ముఖ్యమైన తేదీలు
నోటిఫికేషన్ విడుదల: జూన్ 15, 2026
దరఖాస్తుల ప్రారంభం: జూన్ 15, 2026
దరఖాస్తుల చివరి తేదీ: జూలై 6, 2026
విధుల్లో చేరే అవకాశం: ఆగస్టు–అక్టోబర్ 2026 మధ్య
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 2: అంగరంగ వైభవంగా తిరుచెందూరు శ్రీసుబ్రహ్మణ్యస్వామి కల్యాణం.. రెండో రోజు విశేషాలివే..!
-
Shashank Srihari : రియల్ స్టార్ శ్రీహరి ఇంట పెళ్లి సందడి.. పెద్ద కుమారుడి నిశ్చితార్థం ఎప్పుడంటే.?
-
OTR: కేటీఆర్ సభ రద్దు వెనుక అసలు కారణమేంటి..? BRSలో హాట్ టాపిక్..
-
Aus Vs Eng: సెంచరీతో టామ్ బాంటన్ వీరవిహారం.. ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లాండ్ అద్భుత విజయం..
-
Dhanashree Verma: చాహల్ మాజీ భార్య ధనశ్రీ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ..
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!