NTV Telugu Site icon

RBI Recruitment 2023: డిగ్రీ అర్హతతో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు..రూ.71,032 జీతం..

Rbi Jobs Latest

Rbi Jobs Latest

కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ప్రభుత్వ బ్యాంక్ అయిన ఆర్బీఐ లో ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. దేశవ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో.. 35 జూనియర్ ఇంజినీర్ (సివిల్/ ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత ఉద్యోగాలకు కనీసం 65 శాతం మార్కులతో సివిల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ లేదా స్పెషలైజేషన్‌లో డిప్లొమా లేదా ఇంజనీరింగ్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. జూన్‌ 1, 2023 తేదీ నాటికి దరఖాస్తుదారుల వయసు 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉండాలి..

ఆసక్తి కలిగిన వాళ్ళు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. జూన్‌ 30, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలకు చెందిన వారు రూ.450, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్ధులు రూ.50 అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది..ఆన్లైన్లో టేస్ట్ ఉంటుంది..లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. రాత పరీక్ష జులై 15వ తేదీన ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.33,900ల నుంచి రూ.71,032 వరకు జీతం ఉంటుంది.. నోటిఫికేషన్ గురించి మరింత సమాచారం ను అధికారిక వెబ్ సైట్ లో చూడవచ్చు..

పరీక్ష విధానం :

ఈ ఉద్యోగాల కోసం నిర్వహించే టేస్ట్ మార్కులు 300. ఇక ఈ పరీక్ష కు 2:30 గంటల సమయంలో 180 ప్రశ్నలకు సమాధానం రాయవల్సి ఉంటుంది. ఇంగ్లిష్ ల్యాంగ్వెజ్‌లో 50 ప్రశ్నలకు 50 మార్కులు, ఇంజనీరింగ్‌ స్పెషలైజేషన్‌ పేపర్‌ 1లో 40 ప్రశ్నలకు 100 మార్కులు, ఇంజనీరింగ్‌ స్పెషలైజేషన్‌ పేపర్‌ 2లో 40 ప్రశ్నలకు 100 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌లో 50 ప్రశ్నలకు 50 మార్కులకు పరీక్ష ఉంటుంది.. ఆసక్తి కలిగిన వాళ్ళు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోగలరని మనవి.. ఏదైనా ఉద్యోగానికి అప్లై చేసుకొనే ముందు నోటిఫికేషన్ నిజామా కాదా అన్న విషయాన్ని పూర్తి తెలుసుకొనే దరఖాస్తు చేసుకోవడం మంచిది ..

Show comments