పరీక్ష రాయకుండానే కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం పొందే ఛాన్స్ వచ్చింది. గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నవారు ఈఛాన్స్ ను మిస్ చేసుకోకండి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. పవర్‌గ్రిడ్ లో మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. భర్తీకానున్న పోస్టుల్లో మేనేజర్ (ఎలక్ట్రికల్) 09, డిప్యూటీ మేనేజర్ (ఎలక్ట్రికల్) 48, అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్) 58 (ఆంగ్లం) ఉన్నాయి.
Also Read:Ranya Rao: పొలిటికల్ టర్న్ తీసుకున్న రన్యారావు కేసు.. భూ కేటాయింపుపై రగడ
ప్రభుత్వ రంగంలో కెరీర్ ప్రారంభించాలని కలలు కంటున్న అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు B.E/B.Tech/BSc (ఇంజనీరింగ్) ఎలక్ట్రికల్‌లో డిగ్రీ కలిగి ఉండాలి. దీనితో పాటు, అభ్యర్థికి సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. అభ్యర్థుల పోస్టును బట్టి వయోపరిమితి మారుతుంది. జనరల్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 39 సంవత్సరాల వరకు ఉంటుంది. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.
Also Read:Jagga Reddy : సినిమాల్లోకి జగ్గారెడ్డి.. ఫస్ట్ లుక్ రిలీజ్
అభ్యర్థుల ఎంపిక షార్ట్‌లిస్టింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. రాత పరీక్ష ఉండదు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.60,000 నుంచి రూ.2,20,000 వరకు జీతం లభిస్తుంది. దరఖాస్తు ఫీజు రూ. 500. SC/ST/PwBD/మాజీ సైనికుల అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 12 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.