NTV Telugu Site icon

Central Bank Of India Recruitment 2025: డిగ్రీ అర్హతతో బ్యాంక్ జాబ్స్.. నెలకు రూ. 85 వేల జీతం

Cbi

Cbi

డిగ్రీ పాసై ఖాళీగా ఉన్నారా? బ్యాంక్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రెగ్యులర్‌ ప్రాతిపదికన వివిద జోనుల్లో జోన్‌ బేస్డ్‌ ఆఫీసర్‌- జూనియర్‌ మేనేజ్‌మెంట్‌ స్కేల్‌ 1 పోస్టుల భర్తీ చేయనుంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 266 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఎంపికైతే నెలకు రూ. 85 వేల వరకు జీతం అందుకోవచ్చు. జాబ్ లేకుండా ఖాళీగా ఉన్నవారు ఈ పోస్టులను అస్సలు వదలకండి.

సెంట్రల్ బ్యాంక్ ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన విద్యార్హతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ, మెడికల్, ఇంజినీరింగ్, చార్టెడ్‌ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్డ్వ్ కేటాగిరి అభ్యర్థులకు వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి. ఈ పోస్టులకు సీబీటీ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఎంపికైన వారికి నెలకు రూ.48,480- రూ.85,920 వరకు జీతం ఉంటుంది. అప్లికేషన్ ఫీజు జనరల్‌ అభ్యర్థులు రూ.850+ జీఎస్‌టీ చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175+ జీఎస్‌టీ చెల్లించాలి. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 09వ తేదీ వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.