NTV Telugu Site icon

Bank of Baroda Apprentice Recruitment 2025: డిగ్రీ పాసైతే చాలు.. 4000 బ్యాంక్ జాబ్స్ రెడీ.. మిస్ చేసుకోకండి

Bank Of Baroda

Bank Of Baroda

బ్యాంకు ఉద్యోగాలకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. బ్యాంక్ జాబ్స్ కోసం ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతుంటారు. మరి మీరు కూడా బ్యాంక్ జాబ్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. బ్యాంకు ఉద్యోగం సంపాదించాలని కలలు కంటున్న యువతకు బ్యాంక్ ఆఫ్ బరోడా తీపికబురును అందించింది. అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 4000 పోస్టులను భర్తీచేయనున్నారు. మొత్తం పోస్టుల్లో తెలంగాణలో 193, ఆంధ్రప్రదేశ్ లో 59 పోస్టులు భర్తీకానున్నాయి. డిగ్రీ పాసై ఖాళీగా ఉన్నవారికి ఇదే మంచి ఛాన్స్.

Also Read:Tesla Cars : నిరీక్షణకు తెర.. ఏప్రిల్ నుంచి భారత్ లో పరిగెత్తనున్న టెస్లా కార్లు.. ధర చాలా ఛీప్

బ్యాంక్ జాబ్స్ కోసం ట్రై చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి ఏదైనా స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల కనీస వయస్సు 20 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు, గరిష్ట వయస్సు 28 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం గరిష్ట వయస్సులో సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్థానిక భాష పరీక్ష తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Also Read:YS Jagan: ఓ ప్రతిపక్ష నేత పర్యటనకు వస్తే.. కనీసం పోలీస్ భద్రత కూడా సీఎం ఇవ్వలేదు!

ఎంపికైన వారికి మెట్రో/అర్బన్ ఏరియాలో రూ. 15 వేలు, రూరల్/సెమీ అర్భన్ ఏరియలో రూ. 12 వేలు చెల్లిస్తారు. జనరల్, OBC, EWS కేటగిరీ అభ్యర్థులు రూ. 800 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు రూ.600, పిడబ్ల్యుబిడి కేటగిరీ అభ్యర్థులు రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఈరోజు అంటే ఫిబ్రవరి 19న ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు మార్చి 11 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.