Site icon NTV Telugu

India Post GDS Recruitment 2025: మళ్లీరాని ఛాన్స్.. 10th పాసైతే చాలు.. 21,413 పోస్టల్ జాబ్స్ మీవే.. పరీక్ష లేదు

Post

Post

పదోతరగతి పాసై ఖాళీగా ఉన్నారా? ఉద్యోగం లేదని వర్రీ అవుతున్నారా? టెన్త్ అర్హతతో మంచి ప్రభుత్వం కోసం చూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూ్స్. ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే ఛాన్స్ వచ్చింది. తాజాగా ఇండియా పోస్ట్ వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 21,413 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేయనున్నది. బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM), గ్రామీణ డాక్ సేవక్స్ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 1215 పోస్టులు.. తెలంగాణలో 519 పోస్టులు భర్తీకానున్నాయి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే జాజ్ పొందొచ్చు.

Also Read:Massive Traffic Jams: ‘‘4 గంటల ప్రయాణానికి 12 గంటల సమయం’’.. కుంభమేళా దారుల్లో ట్రాఫిక్ జామ్..

గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి 10వ తరగతి/మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి గణితం, ఆంగ్లంలో ఉత్తీర్ణత మార్కులు పొంది ఉండాలి. అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు. గరిష్ట వయస్సు 40 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం గరిష్ట వయస్సులో సడలింపు ఉంటుంది. టెన్త్ లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.

Also Read:CM Chandrababu: అడవి మార్గంలో శ్రీశైలానికి వచ్చే వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలిగించొద్దు

బిపిఎం పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 12,000 నుంచి రూ. 29,380 వరకు జీతం చెల్లిస్తారు. ఎబిపిఎం/ డాక్ సేవక్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 10,000 నుంచి రూ. 24,470 వరకు జీతం చెల్లిస్తారు. అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, SC/ST, PwD, ట్రాన్స్‌వుమెన్ లకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 10 నుంచి ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 03 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Exit mobile version