నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. పాఠశాల విద్యాశాఖలో 502 టీచర్ పోస్టులతో డీఎస్సీ లిమిటెడ్ రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేషన్ విడుదల చేశారు.. రాష్ట్రంలోని జడ్పీ, ఎంపీపీ స్కూళ్లలో 199 పోస్టులు, మోడల్ స్కూళ్లలో 207 పోస్టులు భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు.. ఇక, మున్సిపల్ స్కూళ్లలో 15 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టనున్నారు. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు 81 ఉన్నాయని తెలిపారు.. మొత్తంగా 502 టీచర్ పోస్టులతో డీఎస్సీ లిమిటెడ్ రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేషన్ విడుదల చేసింది పాఠశాల విద్యాశాఖ. ఫీజు చెల్లింపునకు ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 17 వరకు గడువు ఇచ్చింది.. ఈనెల 25 నుంచి సెప్టెంబర్ 18 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉండగా… అక్టోబర్ 23న పరీక్ష నిర్వహించి.. నవంబర్ 4వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు. మరోవైపు.. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ కల్పించారు. కాగా, బీఎడ్ పూర్తి చేసి.. టెట్ రాసిన చాలా మంది అభ్యర్థులు… డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారు.. పూర్తిస్థాయిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయకపోయినా.. లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది సర్కార్.
Read Also: CM YS Jagan Mohan Reddy: జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
