భారత రక్షణ దళాల్లో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ ఒక ప్రత్యేకమైనది..ఈ సంస్థ సైన్యం భారత్, చైనా ల మధ్య రక్షణ దళంగా ఉంటారు..ఈ పోర్స్ లో ఉద్యోగాలకు పదో తరగతి అర్హత ఉంటే సరిపోతుంది.. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ recruitment.itbpolice.nic.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ నేడు(జూన్ 27న) ప్రారంభమైంది. అభ్యర్థులు జులై 26 వరకు అప్లై చేసుకోవచ్చు.. తాజాగా ఈ పోస్టుల కోసం 458 పోస్టుల నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఆ నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 458 పోస్టుల్లో 195 స్థానాలు జనరల్ కేటగిరీకి, 110 పోస్టులు ఓబీసీ అభ్యర్థులకు, 74 పోస్టులు షెడ్యూల్డ్ కులాలకు, 42 పోస్టులు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు, 37 పోస్టులు షెడ్యూల్డ్ తెగలకు రిజర్వు చేశారు… అలాగే 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి లేదా గుర్తింపు పొందిన విద్యా బోర్డు లేదా ఇన్‌స్టిట్యూషన్ నుంచి సమానమైన అర్హతను కలిగి ఉండాలి.. డ్రైవింగ్ లైసెన్స్ ను కలిగి ఉండాలి..జనరల్, OBC, EWS వర్గాలకు చెందిన అభ్యర్థులు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.. మిగిలిన వారికి ఫీజు అవసరం..
ఎలా అప్లై చేసుకోవాలి?
*. అధికారిక వెబ్‌సైట్ https://www.itbpolice.nic.in/ ఓపెన్ చేయాలి.
*. హోమ్‌పేజీలో రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేయాలి.
*. అవసరమైన వివరాలను ఎంటర్ చేసి, అప్లికేషన్ ఫారమ్‌ను నింపాలి.
*. ఫీజు పేమెంట్ చేసి, అప్లికేషన్ సబ్‌మిట్ చేయాలి.
*. భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింటవుట్ తీసుకోవాలి..
ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), రాత పరీక్ష ఉంటాయి. ఒరిజినల్ డాక్యుమెంట్‌ల వెరిఫికేషన్, ప్రాక్టికల్ టెస్ట్, కాంప్రహెన్సివ్ మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు..అర్హత,ఆసక్తి కలిగిన అభ్యర్థులను వెబ్ సైట్ ను ఒకసారి చెక్ చేసి అప్లై చేసుకోగలరు..
