ఈరోజుల్లో చదవడం చాలా ఈజీనే కానీ జాబ్ తెచ్చుకోవడమే కష్టం..అయితే ఇంటర్వ్యూ లో కొన్ని టిప్స్ పాటిస్తే జాబ్ వస్తుందని నిపుణులు అంటున్నారు.. అదేంటంటే ఇంటర్వ్యూలో వెళ్లే విధానం కూడా ఇంపార్టెంట్ అట.. అవతల వ్యక్తి చూడటానికి బాగుంటే కొంతవరకు మనమీద ఇంప్రెషన్ కలుగుతుందని ప్రముఖులు చెబుతున్నారు.. ఇక ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
మాములుగా ఇంటర్వ్యూ అంటేనే అదో రకమైన ఆందోళన ఉండటం సర్వసాధారణం. ఈ రౌండ్‌లో మంచి ప్రతిభ కనబర్చాలంటే ధరించిన దుస్తులు సౌకర్యవంతంగా ఉండాలి. మీ హావభావాలను నిరోధించకుండా, శరీరానికి ఇబ్బంది లేకుండా ఉండే దుస్తులు ధరించడం మంచిది. కొత్త దుస్తుల కోసం డబ్బు ఖర్చు చేయడం కంటే సౌకర్యవంతంగా ఉందని మీకు ఇప్పటికే తెలిసిన వాటిని ధరించడం బెటర్. క్లాత్స్ ముడతలు లేకుండా మీకు సరిగ్గా ఫిట్ అయ్యే విధంగా ఉండాలి..
ఈ మధ్య ఇంటర్వ్యూలు పబ్లిక్ ప్లేసులలో కూడా జరుగుతున్నాయి..దీంతో లొకేషన్‌కు తగ్గట్టు డ్రెస్సింగ్ కూడా కీలకం. వర్చువల్ ఇంటరాక్షన్ కోసం, మీ బ్యాక్‌గ్రౌండ్‌కు భిన్నంగా ఉండే రంగుల దుస్తులను ఎంచుకోండి. తద్వారా ఇంటర్వ్యూలో చక్కగా ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది.. అలాగే షూస్.. ఫార్మల్ షూస్, పంప్ హీల్స్, లో హీల్స్ ధరించండి. మీ దుస్తులతో షూస్ మ్యాచ్ అవ్వాలి. సాధారణ ఇంటర్వ్యూకి హాజరవుతున్నప్పటికీ, క్లోజ్డ్- ఫ్లాట్స్ ధరించాలి..
కొన్ని సార్లు అభ్యర్థి సహనాన్ని పరీక్షించడానికి కొన్ని సంస్థలు ఒక్కోసారి ఇలా చేస్తుంటాయి. కాబట్టి డీలా పడిపోయి నీరసంగా ఉండకండి. ఇంటర్వ్యూ కోసం ఎప్పుడు పిలిచినా ఉత్సాహంగా ఉన్నట్లు కనిపించాలి.. ఇంటర్వ్యూల్లో అభ్యర్థి ఆత్మవిశ్వాసాన్ని ప్రత్యేకంగా గమనిస్తుంటారు. కాబట్టి మనం చెప్పే సమాధానం ఆత్మవిశ్వాసంగా ఉండాలి. అయితే కొన్ని విషయాల్లో అవసరమైన దానికంటే ఎక్కువగా స్పందించడం, సమాధానాన్ని గట్టిగా చెప్పడం వంటివి చేయకూడదు.. ఏదైనా స్మూత్గా ప్లేజెంట్ గా ఉండేలా చూసుకోవాలి..ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే జాబ్ గ్యారంటిగా మీకే వస్తుంది..
