Special Trains for NEET Candidates: నీట్ అభ్యర్థులకు రైల్వే గుడ్ న్యూస్.. రేపు ప్రత్యేక రైళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Special Trains for NEET Candidates: నీట్ పరీక్షకు హాజరయ్యే లక్షలాది మంది విద్యార్థులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకునేలా చూడటానికి తూర్పు మధ్య రైల్వే జూన్ 21న తొమ్మిది ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రైళ్ల మార్గాలు, టైమ్‌టేబుళ్లను కూడా విడుదల చేసింది. నీట్ పరీక్ష రోజున విద్యార్థులు ప్రయాణ ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండటం, పరీక్షా కేంద్రాలకు ఆలస్యం కాకుండా చేరుకోవడం కోసం ఈ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు తూర్పు మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి సరస్వతి చంద్ర తెలిపారు. ఇందుకోసం అన్ని అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
ఈ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు
నీట్ పరీక్ష నిర్వహించే రోజు అనగా జూన్ 21 ఆదివారం రోజు పాట్నా-దర్భంగా, పాట్నా-గయా, దానాపూర్-ఝఝా, ఝఝా-దానాపూర్, పాట్నా-బక్సర్, బక్సర్-పాట్నా, వారణాసి-పాట్నా, రాంచీ-డాల్తోన్‌గంజ్, రాంచీ-ధన్‌బాద్ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. ఈ మార్గాల్లో పెద్ద సంఖ్యలో నీట్ అభ్యర్థులు ప్రయాణించే అవకాశం ఉందని రైల్వే అధికారులు తెలిపారు.
Also Read
- Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
- Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
- TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
- NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
రైళ్ల పూర్తి షెడ్యూల్ విడుదల
రైలు నెం. 08603 రాంచీ-ధన్‌బాద్ సాయంత్రం 6:30 గంటలకు, 08631 రాంచీ-డాల్తోన్‌గంజ్ రాత్రి 7:15 గంటలకు బయలుదేరుతుంది. 04208 వారణాసి-పాట్నా రైలు సాయంత్రం 5:45 గంటలకు నడుస్తుంది. అలాగే పాట్నా, బక్సర్, గయా, దానాపూర్, ఝఝా, దర్భంగా మార్గాల్లో కూడా ప్రత్యేక రైళ్లను షెడ్యూల్ చేశారు.
ప్రయాణికులకు రైల్వే విజ్ఞప్తి
ప్రయాణ సమయంలో ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడంలో సహకరించాలని రైల్వే శాఖ ప్రయాణికులకు సూచించింది. ఎవరైనా రైల్వే ఆస్తులకు నష్టం కలిగించే ప్రయత్నం చేస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరింది. పరీక్ష రోజున రైళ్ల కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచడంతో పాటు అవసరమైతే అదనపు సిబ్బందిని కూడా నియమించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
9 ప్రత్యేక రైళ్ల పూర్తి షెడ్యూల్
* రైలు నెం. 08603: రాంచీ నుండి ధన్‌బాద్, బయలుదేరే సమయం సాయంత్రం 6:30.
* రైలు నెం. 08631: రాంచీ నుండి డాల్తోన్‌గంజ్, బయలుదేరే సమయం రాత్రి 7:15.
* రైలు నెం. 04208: వారణాసి నుండి పాట్నాకు, బయలుదేరే సమయం సాయంత్రం 5:45.
* రైలు నెం. 03212: బక్సర్ నుండి పాట్నా, బయలుదేరే సమయం ఉదయం 6:30.
* రైలు నెం. 03213: పాట్నా నుండి బక్సర్, బయలుదేరే సమయం సాయంత్రం 6:20.
* రైలు నెం. 03214: ఝఝా నుండి దానాపూర్, బయలుదేరే సమయం 3:40 AM.
* రైలు నెం. 03215: దానాపూర్ నుండి ఝఝా, బయలుదేరే సమయం 6:15 PM.
* రైలు నెం. 03216: పాట్నా నుండి గయ, బయలుదేరే సమయం ఉదయం 6:00 గంటలు.
* రైలు నెం. 03211: పాట్నా నుండి దర్భంగా, బయలుదేరే సమయం ఉదయం 4:30 గంటలకు.. అయితే, పరీక్ష రోజున రైళ్ల కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచుతామని రైల్వే అధికారులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Pakistan Cosmetics : హైదరాబాద్‌లో పాకిస్థాన్ కాస్మెటిక్స్ ముఠా గుట్టురట్టు
-
Rahul Gandhi: భారత పైలట్‌పై ప్రపంచం ప్రశంసలు.. కానీ రాహుల్ గాంధీ మౌనం ఎందుకు?
-
Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
-
SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!