Site icon NTV Telugu

Indian Coast Guard Recruitment 2025: పదో తరగతితో ప్రభుత్వ ఉద్యోగం.. వేలల్లో జీతం..

Indian Coast Guard Recruitm

Indian Coast Guard Recruitm

Indian Coast Guard Recruitment 2025: ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యంగా కష్టపడుతున్న వారికి శుభవార్త. తాజాగా ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేక ఉద్యోగాలకు నియామకాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో విశేషం ఏమిటంటే ఈ ఉద్యోగాలకు 10వ తరగతి చదివిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి వీలు ఉంది. ఎంపికైన అభ్యర్థులు అదనపు భత్యాలతో నెలకు ₹69,100 వరకు జీతం పొందుతారు. ఇంతకీ నోటిఫికేషన్‌లో ఇండియన్ కోస్ట్ గార్డ్ ఏయే ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది, దరఖాస్తు ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనేవి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: Baahubali Epic : ఏంటి.. బాహుబలి కోసం ముందు ఆ హీరోను అనుకున్నారా..?

ఏయే పోస్టులు ఉన్నాయంటే..
తాజాగా ఇండియన్ కోస్ట్ గార్డ్ విడుదల చేసిన ప్రకటనలో మోటార్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్, MTS (ప్యూన్), ATS (డ్రాఫ్టీ), MTS (ప్యాకర్), లాస్కార్ 1వ తరగతి పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించారు. వీటిల్లో మొత్తం 9 పోస్టులకు ఖాళీలు ఉన్నాయి. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఈ పోస్టులకు సెప్టెంబర్ 27న నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పోస్టులకు నవంబర్ 11 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు వారి దరఖాస్తులను పోస్ట్ ద్వారా పంపాలి.

ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందంటే..
10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి విషయానికొస్తే 18 నుంచి 27 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు అన్ని పోస్టులకు అర్హులు. లాస్కార్ పోస్టులకు గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లు. మోటార్ ట్రాన్స్‌పోర్ట్ పోస్టులకు, హెవీ, లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్, రెండేళ్ల అనుభవం అవసరం. ఇతర పోస్టులకు, సంబంధిత రంగాలలో రెండేళ్ల అనుభవం ఉండాలి. రాత పరీక్ష, మెరిట్ జాబితా ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు ఎలా చేయాలంటే..
దరఖాస్తులను ఆఫ్‌లైన్‌లో సమర్పించాలి. దరఖాస్తు ఫారమ్‌ను నోటిఫికేషన్ నుంచి ప్రింట్ తీసుకోవచ్చు. దరఖాస్తును హిందీ లేదా ఇంగ్లీషులో జాగ్రత్తగా పూర్తి చేయాలి. దరఖాస్తు ఫారమ్‌తో పాటు చెల్లుబాటు అయ్యే ఐడి, అవసరమైన విద్యా పత్రాలు, కుల ధృవీకరణ పత్రం, ఇతర పత్రాలు, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు ₹50 పోస్టల్ స్టాంప్ తప్పనిసరిగా జతచేయాలి. అనంతరం దరఖాస్తుదారులు సంబంధిత గడువులోగా వారి దరఖాస్తులను ది కమాండర్, కోస్ట్ గార్డ్ రీజియన్ (ఎ అండ్ ఎన్), పోస్ట్ బాక్స్ నం. 716, హడ్డో (పిఒ), శ్రీ విజయపురం 744102, అండమాన్ & నికోబార్ చిరునామాకు పంపించాలి.

READ ALSO: Mohanlal Indian Army Honour: మలయాళ సూపర్ స్టార్‌ మోహన్‌లాల్‌కు అరుదైన గౌరవం..

Exit mobile version