IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
- ఐబీపీఎస్ ఆర్ఆర్బీ 2026 నియామకాలు..
- మొత్తం 13,706 పోస్టులు భర్తీ..
- దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 21 వరకు
- ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు 8,183, ఆఫీసర్ స్కేల్-1కు 4,256 ఖాళీలు..
- ఆఫీసర్ స్కేల్-2లో 1,047, స్కేల్-3లో 220 పోస్టులు..
- పోస్టుల ఆధారంగా వయోపరిమితి 18 నుంచి 40 ఏళ్ల వరకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IBPS RRB Recruitment 2026: గ్రామీణ బ్యాంకుల్లో కొలువు సాధించాలనుకునే నిరుద్యోగ యువతకు శుభవార్త. దేశవ్యాప్తంగా ఉన్న రీజినల్ రూరల్ బ్యాంకుల్లో (RRBs) గ్రూప్ ‘A’ ఆఫీసర్లు (స్కేల్-I, II, III), గ్రూప్ ‘B’ ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టుల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సహా దేశవ్యాప్తంగా పలు గ్రామీణ బ్యాంకుల్లోని 13,706 ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Also Read
- CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
- SSC Memos: మార్చి, జూన్ 2026 పరీక్షల్లో పాసైన ‘పది’ విద్యార్థులకు అలర్ట్.. రేపు సర్టిఫికేట్ల పంపిణీ..
- India Post GDS : పదో తరగతితో పోస్ట్ఆఫీస్ జాబ్.. 25 వేలకుపైగా పోస్టులు
- Onkar Batra: 7ఏళ్లకే వెబ్సైట్.. 20ఏళ్లకే శాటిలైట్.. కశ్మీర్ యువకుడి సక్సెస్ స్టోరీ!
ముఖ్యమైన తేదీలు:
ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్ 1, 2026 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 21, 2026తో ముగుస్తుంది. దరఖాస్తు ఫీజు చెల్లింపుకు కూడా సెప్టెంబర్ 21 చివరి తేదీ. ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్-I పోస్టులకు ప్రిలిమినరీ పరీక్షలను నవంబర్ లేదా డిసెంబర్ 2026లో నిర్వహిస్తారు. ఆ తర్వాత మెయిన్స్, సింగిల్ లెవెల్ పరీక్షలను డిసెంబర్ 2026 లేదా ఫిబ్రవరి 2027లో నిర్వహించనున్నారు. ఆఫీసర్ పోస్టులకు ఇంటర్వ్యూలు జనవరి లేదా ఫిబ్రవరి 2027లో జరుగుతాయి.
విద్యార్హతలు & వయోపరిమితి:
ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్), ఆఫీసర్ స్కేల్-I (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండటంతో పాటు స్థానిక భాషా పరిజ్ఞానం ఉండాలి. ఆఫీసర్ స్కేల్-II, III పోస్టులకు సంబంధిత విభాగంలో కనీసం 50% మార్కులతో డిగ్రీ/ప్రొఫెషనల్ అర్హతతో పాటు నిర్దేశిత పని అనుభవం అవసరం. సెప్టెంబర్ 1, 2026 నాటికి ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుకు 18 నుంచి 28 ఏళ్లు, ఆఫీసర్ స్కేల్-I కు 18 నుంచి 30 ఏళ్లు, స్కేల్-II కు 21 నుంచి 32 ఏళ్లు, స్కేల్-III కు 21 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల గరిష్ట వయోపరిమితి సడలింపు ఉంటుంది.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు..
* ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్): 8,183 ఖాళీలు,
* ఆఫీసర్ స్కేల్ 1 (పిఓ): 4,256 ఖాళీలు,
* ఆఫీసర్ స్కేల్ 2 (మేనేజర్): 1,047 ఖాళీలు,
* ఆఫీసర్ స్కేల్ 3 (సీనియర్ మేనేజర్): 220 ఖాళీలు.
దరఖాస్తు రుసుము:
ఆఫీసర్ కేడర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ (PwBD) అభ్యర్థులు రూ. 175 ఫీజు చెల్లించాలి. ఇతర అభ్యర్థులందరికీ ఫీజు రూ. 850 గా నిర్ణయించారు. ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుకు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ. 175, ఇతరులు రూ. 850 ఆన్లైన్ గేట్‌వే ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం:
ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు. వీరికి ఇంటర్వ్యూ ఉండదు. ఆఫీసర్ స్కేల్-I పోస్టుకు ప్రిలిమ్స్, మెయిన్స్ లతో పాటు ఇంటర్వ్యూ ఉంటుంది. ఆఫీసర్ స్కేల్-II, III పోస్టులకు సింగిల్ లెవెల్ ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇక అన్ని ఆబ్జెక్టివ్ పరీక్షల్లో నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కట్ చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, కర్నూలు తదితర ప్రధాన నగరాల్లో పరీక్షా కేంద్రాలు ఉంటాయి.
దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే..?
అభ్యర్థులు IBPS అధికారిక వెబ్సైట్ www.ibps.in సందర్శించి, ‘CRP RRBs XV’ లింక్ ద్వారా ముందుగా బేసిక్ వివరాలతో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. ఆ తర్వాత వారు చెప్పిన కొలతల్లో ఫోటోగ్రాఫ్, సంతకం, ఎడమ చేతి బొటనవేలు ముద్ర, హ్యాండ్‌రైటెన్ డిక్లరేషన్, 10వ తరగతి సర్టిఫికెట్‌ను అప్లోడ్ చేయాలి. వివరాలన్నీ సరిచూసుకున్న తర్వాత దరఖాస్తు ఫీజు చెల్లించి, భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫారమ్ ప్రింటవుట్ కాపీని భద్రపరుచుకోవాలి.
తాజావార్తలు
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Hardik Pandya Injury: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. మరోసారి గాయం.. ఈ గాయాల గోలేందిరా బాబూ!
-
Bigg Boss 10 Telugu: బోల్డ్ పర్సనాలిటీ.. భారీ ఫాలోయింగ్.. హౌస్‌లోకి ఈమె ఎంట్రీ ఇస్తే కుర్రాళ్లు చూపు తిప్పుకోలేరు!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
Hindu Temple Demolition: పాకిస్థాన్‌లో 125 ఏళ్ల పురాతన హిందూ ఆలయం కూల్చివేత.. హిందూ సంఘాల ఆందోళన!
ట్రెండింగ్
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!