NTV Telugu Site icon

IBPS RRB 2024: 10వేల ఉద్యోగాలు రెడీ.. దరఖాస్తు చేసుకోండి ఇలా..

Ibps

Ibps

తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో పనిచేసినందుకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) నోటిఫికేషన్ ను జారీ చేసింది. గ్రామీణ బ్యాంకుల్లో పని చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఆఫీసర్ స్కేల్ I, II, III అలాగే ఆఫీస్ అసిస్ట్ మల్టీపర్పస్ లాంటి విభాగాల్లో కూడా ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు నమోదు చేసుకోవడానికి ఐబీపీఎస్ జూన్ 27న చివరి తారీకును నిర్ణయించింది.

Curry Leaves: కరివేపాకే అని తీసేస్తున్నారా.. అలా చేయడం ఎంత నష్టమంటే..

ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 43 బ్యాంకులలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇక ఈ పోస్టులకు ఆఫీసర్ స్కేల్- I వారికీ 01/06/2024 నాటికి 18 నుండి 30 ఏళ్లలోపు వారు అర్హులు., ఆఫీసర్ స్కేల్- II వారికీ 01/06/2024 నాటికి 21 నుండి 32 ఏళ్లలోపు వారు అర్హులు. ఇక ఆఫీసర్ స్కేల్- III వారికీ 01/06/2024 నాటికి 21 నుండి 40 ఏళ్లలోపు వారు అర్హులు. అలాగే ఇక ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టుకు 01/06/2024 నాటికి 18 నుండి 28 ఏళ్లలోపు వారు అర్హులు. ఇక ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST/OBC/ PH/ ఎస్ – సర్వీస్‌మెన్ అభ్యర్థులకు వయో సడలింపులు ఉంటాయి.

Canada flight: విమానానికి తప్పిన పెను ప్రమాదం.. గాల్లో ఉండగా మంటలు

ఈ నోటిఫికేషన్ అనుసరించి ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా దాని సమానమైన ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇక ఆఫీసర్ కేడర్ పోస్టులకు డిగ్రీ, సిఏ, ఎంబిఏ వంటి ఉత్తీర్ణత ఉండాలి. అలాగే స్కేల్-II, III పోస్టులకు సంబంధిత రంగంలో పని చేసిన అనుభవం కలిగి ఉండాలి. ibps.in సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఇక SC/ST/PWBD అభ్యర్థులకు రూ.175., మిగిలిన వారికి రూ.850గా దరఖాస్తు ఫీజును నిర్ణయించారు. దరఖాస్తులు 7 జూన్ 2024 నుండి స్వీకరిస్తుండగా., దరఖాస్తులకు చివరి తేదీగా 27 జూన్ 2024 నిర్ణయించారు.