NTV Telugu Site icon

IBPS CLERK RECRUITMENT 2024: నిరుద్యోగులకు భారీ రిక్రూట్మెంట్.. 6,218 బ్యాంక్ పోస్టులకు నోటిఫికేషన్..

Ibps

Ibps

IBPS CLERK RECRUITMENT 2024: బ్యాంకులో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలలు కంటున్న యువతకు శుభవార్త. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) జాతీయ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 6128 క్లర్క్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక ఇందుకోసం దరఖాస్తు ప్రక్రియ జూలై 1, 2024 నుండి ప్రారంభించబడింది. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.ibps.inని సందర్శించి ఆన్లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను చివరి తేదీ 21 జూలై 2024లోగా పూరించవచ్చు.

B.Krishna Mohan: బీఆర్ఎస్ కు మరో షాక్.. కాంగ్రెస్‌లోకి గద్వాల ఎమ్మెల్యే..?

IBPS 6128 ఖాళీగా ఉన్న క్లర్క్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించింది. ఈ రిక్రూట్‌మెంట్ ప్రతి సంవత్సరం IBPS ద్వారా జరుగుతుంది. ఈ ఏడాది 6 వేలకు పైగా పోస్టుల భర్తీకి ఈ రిక్రూట్‌మెంట్ జరిగింది. వీటిలో గరిష్ట సంఖ్యలో పోస్ట్‌లు ఉత్తరప్రదేశ్‌లో ఖాళీగా ఉన్నాయి. యూపీలో ఖాళీగా ఉన్న 1246 క్లర్క్ పోస్టులకు నియామకాలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 105 పోస్ట్లు., తెలంగాణలో 104 పోస్ట్లు మాత్రమే భర్తీ కానున్నాయి. మునుపటి సంవత్సరంతో పోల్చినట్లయితే.. 2024 సంవత్సరంలో విడుదలైన ఖాళీల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. 2024 సంవత్సరంలో ఈ పెరుగుదల అభ్యర్థులకు సానుకూల పరిణామం.

Xiaomi 14 : బంపర్ ఆఫర్.. అమెజాన్ లో రూ. 20 వేల తగ్గింపు..

ఇక ఈ ఉద్యోగాల కోసం IBPS క్లర్క్ ప్రిలిమినరీ పరీక్షలు ఆగస్టులో ఉండగా, అక్టోబర్‌లో ప్రధాన పరీక్షలు జరుగుతాయి. ఇక ఈ ఉద్యోగాలకు 01.07.2024 నాటికి, అభ్యర్థి తప్పనిసరిగా 20 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్య మాత్రమే ఉండాలి. అంటే అభ్యర్థి 02.07.1996 నుంచి 01.07.2004 మధ్య జన్మించి వారై ఉండాలి. ఇక అభ్యర్థి గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి. లేదా ఏదైనా సమానమైన అర్హతను అభ్యర్థి కలిగి ఉండాలి. ఇక పరీక్షా ఫీజ్ చూస్తే.. SC/ST/PwBD/ESM/DESM అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ. 175 గా ఉండగా.., ఇతరులకు రూ. 850 గా ఉంది. ఈ ఉద్యోగాలకు జులై 21, 2024 దరఖాస్తుకు చివరి తేదీ.

Show comments