Site icon NTV Telugu

Banks Jobs: గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలు..దరఖాస్తులకు ఈరోజే లాస్ట్..

Bank Jobs Recruitment

Bank Jobs Recruitment

బ్యాంకులో ఉద్యోగాలు చెయ్యాలని అనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్..గ్రామీణ బ్యాంకులో భారీగా ఉద్యోగాలు ఉన్నాయి.. ఇందుకు సంబందించిన నోటిఫికేషన్ ను తాజాగా విడుదల చేశారు..రీజినల్ రూరల్ బ్యాంక్స్‌లో వివిధ పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే… అయితే వీటికి ఆన్‌లైన్‌లో అప్లికేషన్స్ జూన్ 1 నుంచి స్వీకరిస్తున్నారు. అయితే వీటికి దరఖాస్తు చేసే చివరి గడువు వచ్చేస్తోంది. ఈరోజు అప్లికేషన్స్ లో చివరి తేదీగా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు మాత్రం ఛాన్స్ ఉంది..

అంటే కొన్ని గంటలకు మాత్రమే వీటికి దరఖాస్తు చేసుకోవడానికి సమయం ఉంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవచ్చు..43 రీజనల్ రూరల్ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్(అసిస్టెంట్ మేనేజర్), క్లర్క్(ఆఫీస్ అసిస్టెంట్), స్కేల్ 2(మేనేజర్), స్కేల్ 3(సీనియర్ మేనేజర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశ వ్యాప్తంగా 8,612 పోస్టులను భర్తీ చెయ్యనున్నట్లు తెలుస్తుంది..

పోస్టుల వివరాలు, అర్హతలు..

ఈ మేరకు 5,538 క్లర్క్ పోస్టులు,

2485 పీవో,

332 ఆఫీసర్ స్కేల్ 2(జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్),

68 ఆఫీసర్ స్కేల్ 2(ఐటీ),

21 ఆఫీసర్ స్కేల్ 2 (సీఏ),

24 ఆఫీసర్ స్కేల్ 2(లా ఆఫీసర్),

9 ట్రెజరీ ఆఫీసర్ స్కేల్ 2,

3 మార్కెటింగ్ ఆఫీసర్ స్కేల్ 2,

60 అగ్రికల్చర్ ఆఫీసర్ స్కేల్ 2,

73 ఆఫీసర్ స్కేల్ 3 పోస్టులను భర్తీ చేయనుంది…

ఎలా అప్లై చేసుకోవాలి..?

*. ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ ibps.in ఓపెన్ చేయాలి.

*. హోం పేజీలో కనిపిస్తున్న ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ అప్లై ఆన్‌లైన్ లింక్‌పై క్లిక్ చేయాలి.

*. వ్యక్తిగత వివరాలను ఫిల్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.

*. తర్వాత అప్లికేషన్ ఫారం ఫిల్ చేసి అడిగిన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.

*. పరీక్ష ఫీజు చెల్లించి రిసీప్ట్‌ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ రిసీప్ట్‌ని ప్రింట్ చేసుకుని భవిష్యత్ అవసరాల కోసం సేవ్ చేసుకోవాలి…
*

క్లర్క్ పోస్టులకు రెండు దఫాలుగా పరీక్షలు ఉంటాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసిన వారు ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. పీవో(స్కేల్ 1), స్కేల్ 2, స్కేల్ 3 పోస్టులకు అప్లై చేసిన వారికి మూడు ఫేజుల్లో ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ ఉంటుంది..ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ పీవో, క్లర్క్ పరీక్ష ఆగస్ట్ 5, 6, 12, 13, 19 తేదీల్లో ఉండనుంది. మరోవైపు, స్కేల్ 2, స్కేల్ 3 పరీక్షలు సెప్టెంబర్ 10న ఉంటాయి.. ఇందులో పాస్ అయిన వారికి నవంబర్ లో ఇంటర్వ్యూ ఉంటుంది.. ఆసక్తి కలిగిన వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి..

Exit mobile version