NTV Telugu Site icon

ITBP: స్పోర్ట్స్ బాగా ఆడుతారా? ఈ కానిస్టేబుల్ జాబ్స్ మీకోసమే.. 10th పాసైతే చాలు

Itbp

Itbp

కానిస్టేబుల్ జాబ్స్ కు ఉండే క్రేజ్ వేరు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తో పాటు స్పోర్ట్స్ ఆడే వారికి కానిస్టేబుల్ జాబ్ సొంతం చేసుకునే ఛాన్స్ వచ్చింది. మీరు ఆటలు బాగా ఆడితే ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) గ్రూప్-సి పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 133 పోస్టులను భర్తీచేయనున్నారు. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

Also Read:Governor Jishnu Dev Varma : మా ప్రభుత్వం సామాజిక న్యాయం సంక్షేమానికి కట్టుబడి ఉంది

అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ (పదో తరగతి) పూర్తి చేసి ఉండాలి. కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 23 సంవత్సరాలు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST/OBC, ఇతర వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయిలో పతకాలు గెలుచిన అభ్యర్థులు అర్హులు. ఎంపిక ప్రక్రియలో స్పోర్ట్స్ ట్రయల్, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST), డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జీతం రూ.21,700 నుంచి రూ.69,100 మధ్య ఉంటుంది.

Also Read:US: బీచ్‌లో అదృశ్యమైన భారత విద్యార్థిని చివరి ఫొటో విడుదల.. సుదీక్షను కౌగిలించుకున్నదెవరు?

క్రీడా విభాగాలు: అథ్లెటిక్స్, స్విమ్మింగ్, షూటింగ్, బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్, తైక్వాండో, ఆర్చరీ, జిమ్నాస్టిక్స్, కబడ్డీ, ఐస్ హాకీ, హాకీ, ఫుట్‌బాల్, గుర్రపు స్వారీ, కాయాకింగ్, రోయింగ్, వాలీబాల్, జూడో, రెజ్లింగ్, హ్యాండ్‌బాల్, ఐస్ స్కీయింగ్, పవర్ లిఫ్టింగ్, ఖోఖో, సైక్లింగ్, యోగాసన, పెన్‌కాక్ సిలాట్, బాస్కెట్‌బాల్. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఏప్రిల్ 2 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.