ప్రభుత్వ ఉద్యోగం సాధించడం గగనమైపోయింది. కాంపిటిషన్ హెవీగా ఉంటోంది. ఇలాంటి తరుణంలో జాబ్ కొట్టాలంటే అసాధారణ ప్రతిభ కనబర్చాల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్య్వూలు, తదితర అంశాల్లో రాణిస్తే తప్ప ఉద్యోగం వరించదు. మరి మీరు కూడా గవర్నమెంట్ జాబ్ కొట్టడమే గోల్ గా పెట్టుకున్నారా? అయితే మీకు తక్కువ కాంపిటిషన్ తో కూడిన జాబ్స్ రెడీగా ఉన్నాయి. ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని ఈజీగా పొందే ఛాన్స్ వచ్చింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 56 వేల జీతం అందుకోవచ్చు. ఇటీవల ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.
ఈ రిక్రూట్ మెంట్ ద్వారా ఈఎస్ఐసీ 608 పోస్టులను భర్తీ చేయనున్నది. దేశ వ్యాప్తంగా ఉన్న ఈఎస్ఐసీ ఆసుపత్రుల్లో ఈ పోస్టులు భర్తీకానున్నాయి. అభ్యర్థులు ఎంబీబీఎస్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు రొటేటింగ్ ఇంటర్న్‌షిప్ పూర్తై ఉండాలి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్-2022/ 2023లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు.
ఈ పోస్టులకు యూపీఎస్సీ నిర్వహించే కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్-2022/ 2023 ఫలితాల్లో ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైతే నెలకు రూ.56,100- 1,77,500 వేతనం అందిస్తారు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం ESIC అధికారిక వెబ్ సైట్ www.esic.gov.in/recruitments ను సందర్శించాల్సి ఉంటుంది.