NTV Telugu Site icon

SECR Recruitment 2025: 10th అర్హతతో.. రైల్వేలో 835 ఉద్యోగాలు.. ఈజీగా జాబ్ కొట్టే ఛాన్స్!

Railway

Railway

రైల్వేలో జాబ్ కోసం లక్షలాది మంది పోటీపడుతుంటారు. రైల్వే జాబ్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. మీరు కూడా రైల్వేలో జాబ్ కొట్టాలని కలలుకంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 835 పోస్టులను భర్తీచేయనున్నారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఈ పోస్టులను సొంతం చేసుకోవచ్చు. టెన్త్ పాసై ఖాళీగా ఉన్నవారు ఈ ఛాన్స్ ను అస్సలు వదులుకోకండి.

Also Read:Crime News: బంగారం కోసం వృద్ధురాలి హత్య.. ఇంట్లోనే ఉన్న బావిలో పడేసిన నిందితులు

ఈ పోస్టులకు పోటీపడే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50% మార్కులతో 10వ తరగతి/ మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు, అభ్యర్థి గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాసై ఉండాలి. అభ్యర్థుల కనీస వయస్సు 15 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు. గరిష్ట వయస్సు 24 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

Also Read:Universal Pension Scheme: భారతీయులకు ‘‘యూనివర్సల్ పెన్షన్ స్కీమ్’’.. కసరత్తు చేస్తున్న కేంద్రం..

ఈ నియామకాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను మెరిట్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్‌, మెడికల్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపికే చేస్తారు. అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన వారికి మంచి వేతనం అందిస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అర్హత, ఆసక్తి ఉన్నవారు మార్చి 25వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.