NTV Telugu Site icon

RRB GroupD Recruitment: రైల్వేలో 32,438 గ్రూప్‌డి జాబ్స్ దరఖాస్తు గడువు పొడిగింపు.. ఇప్పుడే అప్లై చేసుకోండి

Railway

Railway

రైల్వే జాబ్ కోసం ట్రై చేస్తున్న వారికి గుడ్ న్యూస్. ఇటీవల రైల్వేలో 32,438 గ్రూప్‌డి జాబ్స్ భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు అప్లై చేసుకునేందుకు ఫిబ్రవరి 22తో గడువు ముగియనున్నది. ఈ నేపథ్యంలో దరఖాస్తు ప్రక్రియను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు పొడిగించింది. మార్చి 1 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇంకా అప్లై చేసుకోని వారు వెంటనే అప్లై చేసుకోండి. పదో తరగతి అర్హతతోనే రైల్వే జాబ్ సాధించే ఛాన్స్ మిస్ చేసుకోకండి.

Also Read:Harish Shankar: చిన్న సినిమాలో హరీష్ శంకర్

32,438 ఉద్యోగ ఖాళీల్లో.. 13,187 ట్రాక్ మెయింటైన్‌ పోస్టులు, పాయింట్స్ మెన్ ఉద్యోగాలు 5,058, అసిస్టెంట్ ఉద్యోగాలు 3,077 ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని విభాగాల్లోనూ ఖాళీలను భర్తీ చేయనునున్నారు. RRB గ్రూప్ D పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. NCVT నుంచి నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ (NAC) కలిగి ఉండాలి. ఐటీఐ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థి కనీస వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు. గరిష్ట వయస్సు 36 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు.

Also Read:Dandora: దురాగతాలపై ఎక్కుపెట్టిన అస్త్రం ‘దండోరా’ …ఫస్ట్ బీట్ వీడియో!

రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు నిబంధనలు వర్తిస్తాయి. సీబీటీ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ పీహెచ్/ఈబీసీ, అన్ని కేటగిరీల మహిళా అభ్యర్థులు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆన్ లైన్ విధానంలో మార్చి 1 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.