AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ వచ్చేసింది.. జూన్ 5న నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పుడంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET-2026) షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారికంగా విడుదల చేశారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేస్తూ పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడితో పాటు డీఎస్సీ (DSC) నోటిఫికేషన్‌పై కూడా పూర్తి స్పష్టతనిచ్చారు. జూన్ 5వ తేదీన అధికారికంగా టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. జూన్ 5 నుంచి జులై 5వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 25వ తేదీ నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్లను వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆగస్టు 5వ తేదీ నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBT) జరగనున్నాయి. సెప్టెంబర్ 15వ తేదీన ఏపీ టెట్-2026 ఫలితాలను విడుదల చేస్తారు.
అక్టోబరులో డీఎస్సీ నోటిఫికేషన్…
టెట్ ఫలితాలు విడుదలైన వెంటనే, అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ నియామక పరీక్ష నోటిఫికేషన్‌ను ఈ ఏడాది అక్టోబరులో విడుదల చేయనున్నట్లు మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. విద్యా సంవత్సరం నష్టపోకుండా ప్రణాళికాబద్ధంగా ఖాళీలను భర్తీ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
Also Read
- ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
- Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
- Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
ఈసారి టెట్ ఎందుకు కీలకం.. ?
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి ఏటా రెండుసార్లు టెట్ నిర్వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు (ఇన్-సర్వీస్ టీచర్స్) కూడా ప్రమోషన్లు లేదా సర్వీస్ నిబంధనల పరంగా టెట్ అర్హత తప్పనిసరి కావడంతో ఈసారి పోటీ మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. 2011కు ముందు నియామకమైన దాదాపు లక్ష మంది ఉపాధ్యాయులకు గతంలో మినహాయింపు ఉన్నప్పటికీ, తాజా కోర్టు తీర్పుల నేపథ్యంలో వారు కూడా ఈ పరీక్ష రాయడానికి సిద్ధమవుతున్నారు. దీనికి తోడు కొత్తగా డీఈడీ (D.El.Ed), బీఈడీ (B.Ed) పూర్తి చేసిన అభ్యర్థులు కూడా పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. పరీక్షను అత్యంత పారదర్శకంగా, సాంకేతిక పద్ధతుల్లో నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అభ్యర్థులు ఇప్పటి నుంచే అధికారిక వెబ్సైట్ (aptet.apcfss.in) ద్వారా సిలబస్ వివరాలను పరిశీలించి ప్రిపరేషన్ ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
-
Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా!
-
Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!