రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు అసిస్టెంట్ లోకో పైలట్, ఆర్పీఎఫ్ ఎస్సై, టెక్నీషియన్, జేఈ (ALP, RPF SI, Technician, JE) ఇతర పోస్టుల కోసం నిర్వహించే రిక్రూట్‌మెంట్ పరీక్షల తేదీలను ఈరోజు ప్రకటించింది. ఈ రిక్రూట్‌మెంట్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా.. లేదా కింద ఉన్న కథనంలో పరీక్ష షెడ్యూల్‌ను తనిఖీ చేయండి. పరీక్ష తేదీలతో పాటు. అడ్మిట్ కార్డ్ ఎప్పుడు జారీ చేయబడుతుంది.. ఎగ్జామ్ సిటీ స్లిప్ ఎప్పుడు అందుబాటులో ఉంచబడుతుందో కూడా బోర్డు తెలిపింది.
AP CM Chandrababu: ప్రధాని నరేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
RRB ALP పరీక్ష తేదీ 2024: ALP రిక్రూట్‌మెంట్ పరీక్ష షెడ్యూల్
RRB అసిస్టెంట్ లోకో పైలట్ రిక్రూట్‌మెంట్ పరీక్ష నవంబర్ 25 నుండి 29 మధ్య నిర్వహించబడుతుంది. అభ్యర్థులకు తమ పరీక్ష ఏ నగరంలో నిర్వహించబడుతుందో నవంబర్ 15న తెలియజేయనుంది. ఇందుకు సంబంధించిన అడ్మిట్ కార్డును నవంబర్ 22న జారీ చేస్తారు.
RPF SI పరీక్ష తేదీ 2024: RPF SI రిక్రూట్‌మెంట్ పరీక్ష షెడ్యూల్
RPF SI రిక్రూట్‌మెంట్ పరీక్ష డిసెంబర్ 02 నుండి 05 వరకు నిర్వహించనున్నారు. సిటీ స్లిప్ నవంబర్ 22న విడుదల కానుంది. అడ్మిట్ కార్డును నవంబర్ 29న విడుదల చేయనున్నారు.
RPF టెక్నీషియన్ పరీక్ష తేదీ 2024: RRB టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ పరీక్ష షెడ్యూల్
RRB టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ పరీక్ష డిసెంబర్ 16 నుండి 26 మధ్య నిర్వహించనున్నారు. సిటీ స్లిప్ డిసెంబర్ 6న విడుదల కానుంది. అడ్మిట్ కార్డ్ డిసెంబర్ 13న జారీ చేయనున్నారు.
RPF JE పరీక్ష తేదీ 2024: RRB JE రిక్రూట్‌మెంట్ పరీక్ష షెడ్యూల్
RRB JEతో సహా ఇతర నియామక పరీక్షలు డిసెంబర్ 6-13 మధ్య నిర్వహించనున్నారు. సిటీ స్లిప్ నవంబర్ 26న విడుదల కానుంది. అడ్మిట్ కార్డ్ డిసెంబర్ 3న జారీ చేయనున్నారు.
SC/ST అభ్యర్థుల కోసం పరీక్ష నిర్వహించే నగరం, తేదీని తెలుసుకోడానికి లింక్‌ను CEN పరీక్ష తేదీకి 10 రోజుల ముందు అన్ని RRBల అధికారిక వెబ్‌సైట్‌లలో పెట్టనున్నారు.