Zohran Mamdani: నెతన్యాహూను అరెస్ట్ చేస్తాం.. న్యూయార్క్ మేయర్ హెచ్చరిక..

  • న్యూ్యార్క్ వస్తే నెతన్యాహూ అరెస్ట్..
  • చట్టపరమైన సలహాలు తీసుకుంటున్నట్లు వెల్లడించిన మేయర్ మమ్దానీ..
  • నెతన్యాహూ యుద్ధ నేరస్తుడంటూ వ్యాఖ్యలు..
Netanyahu Mamdani

Netanyahu Mamdani

Zohran Mamdani: ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఐక్యరాజ్యసమితి సదస్సు కోసం న్యూయార్క్ వెళ్లబోతున్నారు. అయితే, ఆయన న్యూయార్క్ వస్తే అరెస్ట్ చేస్తామనే విషయాన్ని మరోసారి నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ చెప్పారు. న్యూయర్క్ వచ్చినప్పుడు ఆయనను అరెస్ట్ చేసే అంశంపై ఇంకా చట్టపరమైన సలహాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘ప్రధాని నెతన్యాహూ ది హేగ్‌లో ఉండాల్సిన వ్యక్తి. ఆయన ఒక యుద్ధ నేరస్తుడు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) ఆయనపై అభియోగాలు నమోదు చేసింది.’’ అని అన్నారు. మేయర్ ఎన్నికల ప్రచార సమయంలో నెతన్యాహూను అరెస్ట్ చేస్తానని మమ్దానీ హామీ ఇచ్చారు. అయితే, అరెస్ట్ చేయాలని ఆదేశించి అధికారాలు తనకు ఉన్నాయా లేవా అన్న విషయంపై స్పష్టత లేదని, న్యాయ నిపుణులతో సంప్రదిపులు జరుపుతున్నట్లు తెలిపారు. న్యూయార్క్ చట్టాలు ఎంత వరకు అనుమతిస్తాయో అంత వరకు చర్యలు తీసుకుంటామని మమ్దానీ అన్నారు.

అయితే, మమ్దానీ వ్యాఖ్యలపై ఇజ్రాయిల్ తీవ్రంగా స్పందించింది. ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయిల్ రాయబారి డ్యానీ డాసన్ ఎక్స్ వేదికగా.. మేయర్ తన బాధ్యతలపై దృష్టి పెట్టాల్సింది పోయి, నగరంలో పెరుగుతున్న యూదు వ్యతిరేకత ఘటనల్ని ఎదుర్కోవాల్సి పోయి, ఇజ్రాయిల్‌పై విమర్శలు చేసి ప్రచారం పొందేందుకు ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. నెతన్యాహూ న్యూయార్క్ వస్తారని, ఐక్యరాజ్యసమితిలో మాట్లాడుతారని, అరెస్ట్ కావల్సింది ఎవరైనా ఉంటే అది మమ్దానీనే అని అన్నారు.