Site icon NTV Telugu

Ukraine: రష్యాలో పాక్‌, చైనా కిరాయి సైనికులు.. జెలెన్‌స్కీ ఆరోపణలు

Zelenskyy

Zelenskyy

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యాతో యుద్ధంలో మాస్కో సైనికులతో పాటు పాకిస్థాన్, చైనాకు చెందిన కిరాయి సైనికులతో కూడా పోరాడాల్సి వస్తోందని జెలెన్‌స్కీ ఆరోపించారు.

ఉక్రెయిన్ సైనిక దళాలతో జెలెన్‌స్కీ భేటీ అయ్యారు. ఈ సందర్భాన్ని ఉద్దేశించి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. చైనా, తజికిస్థాన్‌, ఉజ్బెకిస్తాన్‌, పాకిస్థాన్‌తో సహా ఆఫ్రికన్‌ దేశాల నుంచి వస్తున్న కిరాయి సైనికులు యుద్ధంలో పాల్గొంటున్నట్లు తమ దళాలు గుర్తించాయని తెలిపారు. దీనికి తమ వైపు నుంచి ప్రతిస్పందన గట్టిగా ఉంటుందని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్‌కు షాక్.. భారీగా పెరిగిన పసిడి ధర

అయితే జెలెన్‌స్కీ చేసిన ఆరోపణలను పాకిస్థాన్ తీవ్రంగా ఖండించింది. జెలెన్‌స్కీ నిరాధారమైన ఆరోపణలు చేశారని తెలిపింది. దీనికి తగిన ఆధారాలు చూపించేందుకు ఉక్రెయిన్ అధికారులెవరూ తమన సంప్రదించలేదని ఒక ప్రకటనలో తెలిపింది.

ఇది కూడా చదవండి: Priyanka Gandhi: భారతీయుడెవరో నిర్ణయించేది మీరు కాదు.. న్యాయమూర్తుల తీరుపై ప్రియాంకాగాంధీ అసహనం

ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తు్న్నారు. కానీ పుతిన్ అందుకు ససేమిరా అంటున్నారు. దీంతో రష్యా మిత్రదేశాల ద్వారా ఒత్తిడి తెచ్చేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో రష్యాతో సంబంధాలు ఉన్న దేశాలపై ట్రంప్ అధికంగా సుంకాలు పెంచేశారు. తాజాగా రష్యా మాజీ అధ్యక్షుడు డిమిత్రి మెద్వెదేవ్ రెచ్చగొట్టే వ్యాఖ్యల తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అమెరికాకు చెందిన రెండు అణు జలాంతర్గాములు రష్యాలో మోహరించాయి. అయితే అమెరికాను ధీటుగా ఎదుర్కొనే సామర్థ్యం తమ దగ్గర ఎక్కువగా ఉందని రష్యా అంటోంది.

 

Exit mobile version