Site icon NTV Telugu

Russia Warning to Ukraine: ట్రంప్‌తో జెలెన్‌స్కీ భేటీ.. ఉక్రెయిన్‌కి రష్యా అధ్యక్షుడు స్ట్రాంగ్ వార్నింగ్

Puthin

Puthin

Russia Warning to Ukraine: రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం ముగించడానికి శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రష్యా ప్రెసిడెంట్ పుతిన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతియుత మార్గం ద్వారా సమస్య పరిష్కారానికి కీవ్ ముందుకు రాకపోతే.. సైనిక మార్గాలను అనుసరించాల్సి ఉంటుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఈరోజు ( డిసెంబర్ 28న) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump), ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సమావేశం కానున్న నేపథ్యంలో.. పుతిన్‌ ఈ హెచ్చరికలు చేశారు.

Read Also: Fisherman Escapes Crocodile Attack: చేపలు పడుతున్న యువకుడు.. ఒక్కసారిగా మీదికి వచ్చిన..

అయితే, రష్యా మిలిటరీ కమాండ్‌ పోస్టును అధ్యక్షుడు పుతిన్‌ (Vladimir Putin) సందర్శించారు. ఈ సందర్భంగా చీఫ్‌ ఆఫ్‌ జనరల్‌ స్టాఫ్ వాలెరీ గెరిసిమోవ్‌, రష్యన్‌ దళాలతో కాసేపు ముచ్చటించారు. అనంతరం పుతిన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఒక వేళ ఉక్రెయిన్‌ ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోకపోతే.. ప్రత్యేక సైనిక చర్యతో తమ టార్గెట్ ను చేరుకుంటామని వార్నింగ్ ఇచ్చారు శాంతి చర్చలపై కీవ్ అధికారులకు పెద్దగా ఇంట్రెస్ట్ లేనట్లుంది.. సమస్య పరిష్కారానికి వాళ్లు ఇష్టపడటం లేదన్నారు.

Read Also: Tata Punch Facelift: టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది! ఫీచర్స్, లుక్ అదుర్స్‌ గురూ..

ఇక, డొనాల్డ్ ట్రంప్‌తో భేటీకి ముందు కెనడా ప్రధాని మార్క్‌ కార్నీతో ఉక్రెయిన్ అధినేత జెలెన్‌స్కీ (Volodymyr Zelenskyy) సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు రష్యా సహకారం అవసరమని కెనడా ప్రధాని కార్నీ అన్నారు. ఉక్రెయిన్ పై తాజాగా మాస్కో జరిపిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. కీవ్ కు అదనంగా 2. 5 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయాన్ని ఇవ్వబోతున్నట్లు కార్నీ ప్రకటించారు. అయితే, శనివారం నాడు ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై రష్యా భారీగా డ్రోన్లు, బాలిస్టిక్‌ క్షిపణులతో దాడులు కొనసాగించింది. ఈ దాడులను జెలెన్‌స్కీ ఖండించారు.

Exit mobile version