NTV Telugu Site icon

YouTuber: గర్ల్‌ఫ్రెండ్‌ని, ఆమె తల్లిని ఒకేసారి గర్భవతులుగా చేసిన యూట్యూబర్.. నిజం ఏంటంటే..

Nick

Nick

YouTuber: ప్రముఖ యూట్యూబర్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. తన గర్ల్‌ఫ్రెండ్‌ని, ఆమె తల్లిని ఒకేసారి గర్భవతుల్ని చేశానని చెప్పాడు. 3.41 మిలియన్ సబ్‌స్క్రైబర్లు కలిగిన 29 ఏళ్ల యూట్యూబర్ నిక్ యార్డీ గత నెలలో తన 22 ఏళ్ల స్నేహితురాలు జాడే, ఆమె తల్లి 44 ఏళ్ల డానిని ఏకకాలంలో గర్భవతుల్ని చేశానని, తన పిల్లలతో గర్భవతులుగా ఉన్నారని ప్రకటించాడు. అయితే, ఇది ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దీనిపై చాలా మంది విమర్శలు చేశారు.

అయితే, నిజమో అబద్దమో తెలియదు కానీ, అంతటా విమర్శలు రావడంతో తాను చెప్పినదంతా అబద్ధమని వెల్లడించారు. ‘‘పిల్లలు లేరు. ఇది కేవలం స్కిట్ లాంటిది. ఇది నిజం కాదు’’ అని చెప్పాడు. యార్డీ అసలు పేరు నికోలస్ హంటర్, తాను ఇద్దరితో రెండేళ్లుగా సంబంధంలో ఉన్నానని మాత్రం వెల్లడించాడు. గర్భాలు మాత్రం నకిలీవని చెప్పుకొచ్చాడు. జాడే, డానీతో తనకున్న అసాధారణ సంబంధం నిజమేనని ఒప్పుకున్నాడు.

Read Also: Seethakka: మహిళలు ఆర్థికంగా ఎదిగే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేప‌డుతున్నాం..

జమైకాలో పుట్టిన యార్డీ, గంజాయి నేరానికి పాల్పడి ఒక ఏడాది జైలులో ఉన్నాడు. ఆ తర్వాత 2017లో తన సోషల్ మీడియా కెరీర్ ప్రారంభించాడు. ఇతర ఇంటర్నెట్ ఇన్‌ఫ్లూయెన్సర్లతో స్కిట్స్, కంటెంట్ క్రియేషన్ ప్రారంభించాడు. తన తోటి క్రియేటర్ జెడ్ కూడా ఆన్‌లైన్‌లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది.

గత నెలలో యార్డీ ‘‘వి ఆర్ ప్రెగ్నెంట్’’ అనే యూట్యూబ్ వీడియోని రిలీజ్ చేశాడు. దీనిలో జాడే, డాని మెటర్నటీ డ్రెస్సుల్లో కనిపించారు. జాడే తనకు ఆడపిల్ల పుడుతుందని చెప్పగా, డానీ మాత్రం తాను యార్డీ కొడుకుని కంటున్నట్లు చెప్పింది. ఇద్దరు కూడా రెండు వారాల వ్యవధిలో గర్భం దాల్చినట్లు వీడియోలో చెప్పాడు. ఒక వ్యక్తి ద్వారా తల్లి, కూతురు ఒకేసారి గర్భవతి కావడం చాలా అరుదు అని జాడే వీడియోలో చెప్పడం చూడవచ్చు.