Hamas Chief: హమాస్ అధిపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇజ్రాయెల్‌పై ఆత్మాహుతి దాడులు చేసేందుకు యాహ్యా సిన్వార్ ఆదేశించినట్లు సమాచారం. ఈ విషయాన్ని వాల్‌స్ట్రీట్ పత్రిక ఓ కథనంలో వెల్లడించింది. సిన్వార్ అధికార కాంక్షతో ఉన్నాడని ఖతర్ అధికారులు చెప్పినట్లు పేర్కొనింది. ఇస్మాయిల్ హనియే మరణం తర్వాత బాధ్యతలు చేపట్టిన వెంటనే వెస్ట్‌బ్యాంక్ నుంచి ఇజ్రాయెల్‌లో ఆత్మాహుతి దాడులు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించింది. దీనిపై కొందరు హమాస్ నేతలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారని కథనంలో పేర్కొనింది.
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
ఇక, వాస్తవానికి రెండో ఇంతిఫాదా సమయంలో ఇలాంటి దాడులు వెస్ట్‌బ్యాంక్ మీదుగా ఇజ్రాయెల్‌పై జరిగాయి. ఆ తర్వాత వెస్ట్‌బ్యాంక్ బలమైన సరిహద్దు రక్షణ వ్యవస్థలను ఇజ్రాయెల్ నిర్మించడంతో పాటు ఇంటెలిజెన్స్‌ను పెంచింది. ఖతర్‌కు చెందిన ఓ అధికారి ప్రైవేటుగా వెల్లడినట్లు వాల్‌స్ట్రీట్ పేర్కొనింది. అతడు ఇటీవల వారితో మాట్లాడుతుండగా.. గాజా యుద్ధంలో అతడి పాత్ర గురించి చాలా గొప్పలు చెప్పుకొన్నట్లు తెలిపారంది. అంతేకాదు, హనియే చనిపోయిన తర్వాత ఖలీద్ మష్షాల్‌ను వారసుడిగా ఎన్నుకోవాలని హమాస్ రాజకీయ విభాగ సభ్యులు అనుకున్నాయి.. కచ్చితంగా యహ్యా సిన్వార్‌నే ఎన్నుకోవాలంటూ సాయుధ విభాగం సందేశం పంపినట్లు పేర్కొన్నారంది. ఇటీవల సిన్వార్ ఖతర్ అధికారులతో సంబంధాలను పునరుద్ధరించున్నారని మీడియాలో కథనాలు వచ్చాయి. ఖతర్- హమాస్ మధ్యవర్తి బృందానికి రాసిన లేఖను తాము చూసినట్లు వాల్‌స్ట్రీట్ పత్రిక వెల్లడించింది.