NTV Telugu Site icon

Yahoo: లేఆఫ్ ప్రకటించనున్న యాహూ.. 20 శాతం ఉద్యోగులకు ఉద్వాసన

Yahoo

Yahoo

Yahoo Layoff: టెక్ కంపెనీల్లో లేఆఫ్స్ పర్వం నడుస్తూనే ఉంది. రోజుకో టెక్ కంపెనీ ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంటోంది. ఎప్పుడు ఎవరి ఉద్యోగం పోతుందో అని ఐటీ ఉద్యోగులు గుబులు పడిపోతున్నారు. ఉన్నపలంగా ఉద్యోగం నుంచి తొలగిస్తే తమ పరిస్థితి ఏంటని భయపడుతున్నారు ఉద్యోగులు. ఇప్పటికే టెక్ దిగ్గజ కంపెనీలు అయిన గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ట్విట్టర్ లు తమ ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఆర్థిక మాంద్యం భయాలతోనే ఖర్చులను తగ్గించుకునే ఉద్దేశంతోనే కంపెనీలు ఇలా చేస్తున్నాయి.

Read Also: Rajasthan: ప్రధాని పర్యటనకు ముందు దౌసాలో భారీగా పట్టుబడిన పేలుడు పదార్ధాలు..

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ జాబితాలో మరో టెక్ కంపెనీ చేరింది. యాహూ తన యాడ్ టెక్ యూనిట్ పునర్నిర్మాణంలో భాగంగా తన ఉద్యోగుల్లో 20 శాతం కన్నా ఎక్కువమందిని తొలగించాలని అనుకుంటోందని ఓ నివేదిక వెల్లడించింది. ఈ తొలగింపు వల్ల యాహూ యాడ్ టెక్ ఉద్యోగుల్లో 50 శాతం మందిపై అంటే దాదాపుగా 1600 కంటే ఎక్కువ మంది ప్రభావితం కానున్నారు.

ఇప్పటికే అమెజాన్, మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలు తమ ఉద్యోగులను తొలగించుకున్నాయి. ఆర్థికమాంద్యం పరిస్థితులను బూచిగా చూపిస్తూ ఉద్యోగులను తొలగించాయి. అమెజాన్ 18,000 మందిని, మెటా 11,000, గూగుల్ 12,000, మెక్రోసాఫ్ట్ 10,000 మంది ఉద్యోగులను తొలగించింది. రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీలు కూడా ఉద్యోగులను తొలగిస్తాయనే వార్తలు ఉద్యోగుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. దేశీయ ఐటీ కంపెనీ విప్రో కూడా ఇటీవల ఫ్రెషర్లను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.ది వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం, గత ఏడాది నవంబర్ నుండి దాదాపు యూఎస్ లో 2,00,000 మంది ఐటి ఉద్యోగులు తొలగించబడ్డారు. నివేదికల ప్రకారం తొలగించబడిన ఉద్యోగుల్లో 30 నుండి 40 శాతం మధ్య భారతీయ ఐటీ నిపుణులే ఉన్నారు. దీంతో ఇండియన్స్ లో కలవరం ప్రారంభం అయింది.