NTV Telugu Site icon

World’s Oldest Dog: కుక్కకు గిన్నిస్‌ రికార్డు.. అంత స్పెషల్‌ ఏంటో?

Worlds Oldest Dog Bobi Turns 31 Birthday Party

Worlds Oldest Dog Bobi Turns 31 Birthday Party

World’s Oldest Dog: చాలా మందికి కుక్కల పెంపకం అంటే ఎంతో ఇష్టం. ఒక్కసారి కుక్కలపై ప్రేమ చూపిస్తే జీవితాంతం విధేయత చూపిస్తాయి. యజమానికి ఎలాంటి కష్టం మెచ్చినా అస్సలు సహించలేవు. అలాంటి కుక్కలను మనం చూస్తుంటాము. సోషల్‌ మీడియాలో కూడా అలాంటి వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అయితే కుక్కలు సాధారణంగా 15 నుండి 20 సంవత్సరాల వరకు జీవిస్తాయి. కుక్కలు 25 సంవత్సరాలు జీవిస్తాయి అంటే అది చాలా అరుదు అనే చెప్పాలి. అయితే కొన్ని శునకాలు రెండు లేదా మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించాయి అంటే అది అద్భుతం అని చెప్పాలి. కానీ పోర్చుగీస్ లో ఓ కుక్క 20 లేదా 25 సంవత్సరాలు జీవించడం కాదు.. ఏకంగా 31వ పుట్టినరోజు జరుపుకుని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది.

గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌ సాధించిన కుక్క పేరు బాబీ. ఇది పోర్చుగీస్ రాఫిరో డో అలెంటెజో జాతికి చెందిన మగ కుక్క. పోర్చుగల్‌లోని కాంక్విరాస్ గ్రామానికి చెందిన లియోనెల్ కోస్టా అనే మహిళ ఈ కుక్కను పెంచుకుంటోంది. కోస్టా తల్లిదండ్రులు ఆమె 8 సంవత్సరాల వయస్సులో మే 13, 1992న కుక్కను తమ ఇంటికి తీసుకువచ్చారు. లియోనెల్ కోస్టాకు ప్రస్తుతం 38 ఏళ్లు. గత శనివారం 30 ఏళ్లు నిండి 31 ఏళ్లు పూర్తి చేసుకున్న శునకం బాబీ పుట్టినరోజును కోస్టా ఘనంగా జరుపుకున్నారు. లియోనెల్ కోస్టా దాదాపు 100 మంది ఇరుగుపొరుగువారిని ఆహ్వానించి, వారికి మటన్, చికెన్ , చేపలతో భోజనాలు ఏర్పాటు చేశారు. 31 సంవత్సరాల కుక్క బాబీకి పుట్టినరోజు పార్టీని అందరికి ఘనంగా ఇచ్చారు. ఈ సందర్భంగా బాబీకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను కోస్టా వెల్లడించారు.

తన ఇంటి చుట్టూ అటవీ ప్రాంతం ఉన్నందున బాబీని ఎప్పుడూ గొలుసుతో బంధించలేదని చెప్పింది. బాబీ ఫారెస్ట్‌ ఏరియాలో తిరిగొచ్చి ఇంటి ఆవరణలో పడుకునేదని లియోనల్‌ కోస్టా తెలిపారు. బాబీకి ప్రత్యేకంగా డాగ్ ఫుడ్ ఇవ్వలేదని అన్నారు. బాబీ మనుషుల ఆహారాన్ని మాత్రమే పెట్టేవారని చెప్పారు. ప్రస్తుతం బాబీకి వయసు మీద పడటంతో ఎక్కువగా తిరగలేకపోతున్నదని, ఎక్కువగా ఇంటిపట్టునే ఉంటున్నదని కోస్టా అన్నారు. బాబీకి కంటిచూపు కూడా క్షీణించిందని తెలిపారు. అయితే బాబీ కూడా త్వరలో తన తాత, నానమ్మ, అమ్మానాన్నలు, తల్లిదండ్రుల మాదిరిగానే జ్ఞాపకంగా మిగిలిపోతుందన్న ఊహ చాలా బాధాకరం అని కోస్టా ఆవేదన వ్యక్తం చేశారు.
Mahabubabad crime: అయ్యో తల్లీ ప్రసవం కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయావా.. ఆసుపత్రి వద్ద ఆందోళన