NTV Telugu Site icon

World’s Longest Car: కారంటే ఇదేరా..! సిమ్మింగ్‌ పూల్‌, హెలిప్యాడ్‌ ఇంకెన్నో..

ఎన్నో కొత్త కొత్త మోడల్స్‌ కార్లు రోడ్డుపైకి వస్తున్నాయి.. కస్టమర్లను ఆకట్టుకునేలా వాటిని డిజైన్‌ చేస్తున్నాయి ఆయా కంపెనీలు.. అయితే, ఇప్పుడు మీడియా, సోషల్‌ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్న కారును చూస్తే ఔరా! అనాల్సిందే.. ఎందుకంటే.. ప్రపంచంలోనే అతిపెద్ద కారు ఇదే.. ఈ కారులో సిమ్మింగ్‌ పూల్‌, మినీ గోల్ఫ్‌కోర్స్‌, హెలిప్యాడ్‌ వంటి అత్యాధునిక సదుపాయాలు ఎన్నో ఉన్నాయి.. అమెరికన్‌ డ్రీమ్‌ పేరుతో ఉన్న ఈ కారు గిన్నిస్‌ రికార్డులో కూడా ఎక్కింది.. ఈ కారు పొడవు 30.54 మీటర్లు.. మరో ప్రత్యేకత ఏంటంటే..? ఇరు వైపులా నడిపే సౌకర్యం ఉంది.. 1986లోనే ఈ కారును తయారు చేశారట. కాలిఫోర్నియాకు చెందిన కార్‌ కస్టమైజర్‌ జాయ్ ఓర్‌బెర్గ్‌ తొలుత ఈ కారును రూపొందించారు. సాధారణంగా కార్లు 12 నుండి 16 అడుగుల పొడవు ఉంటాయి. కానీ, జాయ్ ఈ కారును 18.28 మీటర్ల పొడవుతో తయారు చేశారు. అంతేకాదు.. ఇప్పుడు దానిని 30.5 మీటర్లకు పెంచారు. 26 చక్రాలు, రెండు వీ8 ఇంజన్లతో రూపొందించారు.

Read Also: Ukraine crisis: భారత రాయబార కార్యాలయం తరలింపు..

ఇటీవల ఈ కారును అత్యాధునిక హంగులతో పునరుద్ధరించడంతో పాటు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు గుర్తించడంతో ఒక్కసారి వైరల్‌గా మారిపోయింది ఈ అతిపెద్ద కారు.. సిమ్మింగ్‌ పూల్‌, హెలిఫ్యాడ్‌, టీవీ, ఫోన్‌, ఫ్రిజ్‌, బాత్‌టబ్‌, వాటర్‌ బెడ్‌ వంటి సదుపాయాలు ఈ కారులో ఉన్నాయి.. ఈ కారు తయారు చేసిన కొత్తలో పలు సినిమాల్లో కూడా కనిపించిందని చెబుతున్నారు.. ఆ తర్వాత అద్దెకు కూడా తీసుకున్నారు. కానీ, నిర్వాహణ ఖర్చులు పెరగడం, పార్కింగ్‌ సమస్యలు రావంతో ఓ మూలన పెట్టేశారు.. అయితే, కారును వేలం వేయడంతో మైఖేల్‌, డిజెర్‌ ల్యాండ్‌ పార్క్‌కార్‌ మ్యూజియం యజమాని మైఖెల్‌ డిజెర్‌ కొనుగోలు చేసి.. ఆ కారుపై మరికొంత ఖర్చు చూసి.. కొత్త హంగులు రుద్దారు.

అత్యంత పొడవైన ఈ కారు ప్రయాణీకులకు లగ్జరీ ప్రయాణాన్ని అందిస్తుంది. ఒక పెద్ద వాటర్‌బెడ్, డైవింగ్ బోర్డ్, బాత్‌టబ్, మినీ-గోల్ఫ్ కోర్స్‌తో పూర్తి చేసిన స్విమ్మింగ్ పూల్ మరియు హెలిప్యాడ్.. ఇలా అనేక సౌకర్యాలు దీని సొంతం.. హెలిప్యాడ్ తయారు చేయడానికి వాహనానికి ఉక్కు బ్రాకెట్లు అమర్చారు. రిఫ్రిజిరేటర్లు, టెలిఫోన్, అనేక టెలివిజన్ సెట్లు కూడా ఉన్నాయి. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, ఈ కారు 75 మందికి పైగా సరిపోతుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం దీని పునరుద్ధరణ 250,000 డాలర్లు ఖర్చు చేశారు.. కొత్త హంగులు దిద్దడానికి మూడు సంవత్సరాలు పట్టినట్టు చెబుతున్నారు.