Georgina Beyer: ట్రాన్స్‌జెండర్స్ అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.. రాజకీయాల్లోనూ తాము సైతం అంటూ అడుగుపెట్టారు.. అయితే, ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ ఎంపీగా రికార్డు సృష్టించిన ఓ ప్రజాప్రతినిధి ఇప్పుడు కన్నుమూశారు.. న్యూజిలాండ్ మాజీ చట్టసభ ప్రతినిధి జార్జినా బేయెర్ మరణించారు.. జార్జినా బెయెర్ వయస్సు 65 ఏళ్లు.. గత కొంత కాలంగా కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఇవాళ సోమవారం తుదిశ్వాస విడిచారు. బేయెర్ స్నేహితులు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.. న్యూజిలాండ్‌కు చెందిన జార్జినా బేయర్, ప్రపంచంలోని మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ ఎంపీగా.. మరియు ట్రాన్స్‌జెండర్స్ హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన న్యాయవాదిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
Read Also: Crime News: దారుణం.. ఆ పనిచేసిందని.. భార్యను చంపి, ముక్కలు చేసిన భర్త
నార్త్ ఐలాండ్‌లో మారుమూల గ్రామంలో జన్మించిన బేయెర్.. మొదట్లో సెక్స్‌వర్కర్‌గా జీవితాన్ని సాగించారు.. ఆ తర్వాత నటిగా, డ్రాగ్ క్వీన్‌గా ఆకట్టుకున్నారు.. రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత కార్టర్‌టన్‌కు మేయర్‌గానూ ఎన్నికయ్యారు. ఈ పదవి చేపట్టిన తొలి ట్రాన్స్‌జెండర్ కూడా బేయరే కావడం విశేషం.. ఇక, 1999లో లేబర్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచి తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టారు బెయెర్. 2007 వరకు ఎంపీగా కొనసాగారు. రెయిన్‌బో కమ్యూనిటీకి సేవల కోసం 2020లో క్వీన్ ఎలిజబెత్ II ద్వారా న్యూజిలాండ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్‌లో సభ్యురాలిగా పనిచేశారు.. ఆమె పౌర సంఘాలు మరియు స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్ధం చేయడంతో పాటు వ్యభిచారాన్ని నేరరహితం చేయడంలో ఆమె చేసిన కృషికి ప్రసిద్ది చెందారు. 2003లో వ్యభిచార సంస్కరణల అంశంపై పార్లమెంటు ముందు మాట్లాడుతూ.. “ఎప్పటికీ ఇవ్వని సమాజం యొక్క అమానవీయం మరియు కపటత్వం కారణంగా 20 ఏళ్లలోపు మరణించిన నాకు తెలిసిన వేశ్యలందరికీ నేను ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నాను. ఆ పరిశ్రమలోకి వచ్చేలా చేసిన పరిస్థితులను రీడీమ్ చేసుకునే అవకాశం వారికి లభించింది అని పేర్కొన్నారు..
మావోరీ సంతతికి చెందిన బేయర్ 2014లో మళ్లీ పార్లమెంట్‌కు పోటీ చేసినా విజయం సాధించలేకపోయారు.. రోజువారీ డయాలసిస్ అవసరమైన నాలుగు సంవత్సరాల చివరి దశలో మూత్రపిండ వైఫల్యం తర్వాత 2017లో బేయర్ కిడ్నీ మార్పిడిని పొందాడు. స్కాటీ కెన్నెడీ అనే స్నేహితుడు ఫేస్‌బుక్ పోస్ట్ ప్రకారం ఆమె సోమవారం ఆస్పత్రిలో మరణించింది. గత వారంలో జార్జి తన దగ్గరి మరియు అత్యంత ప్రియమైన వ్యక్తిగా మెలిగారు.. ఆమె ఏమి జరుగుతుందో ముందే ఊహించింది.. జోకులు పేల్చింది మరియు చివరి క్షణం వరకు ఆమె ఆనందంగా గడిపిందని పేర్కొన్నాడు. ఇక, జార్జినా మేయర్ మృతికి న్యూజిలాండ్ ప్రధాని సహా.. పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.