NTV Telugu Site icon

Hydrogen Motocycle: పెట్రోల్ అవసరం లేదు.. ప్రపంచంలో తొలి హైడ్రోజన్ బైక్..

Hydrogen Motocycle

Hydrogen Motocycle

Hydrogen Motocycle: పెట్రోల్, డిజిల్ వంటి శిలాజ ఇంధనాల స్థానంలో ఆటోమొబైల్ రంగం ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్‌లోకి తీసుకువస్తున్నారు. ఇదిలా ఉంటే, ఇప్పుడు హైడ్రోజన్‌తో నడిచే వాహనాల ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. ప్రముఖ టూ వీలర్ కంపెనీ కవాసకి తొలిసారిగా తన ‘‘హైడ్రోజన్’’ ఆధారిత మోటర్ బైకును ఆవిష్కరించింది. హైడ్రోజన్ ఇంధనంగా వాడే ఇంటర్నల్ కంబర్షన్ ఇంజన్(ఐసీఈ)తో నడిచే బైక్‌ని పరీక్షించింది. ప్రపంచంలోనే ఇదే తొలి హైడ్రోజన్ పవర్డ్ మోటర్ సైకిల్.

Read Also: Cancers In India: భారత్‌లో పెరుగుతున్న “హెడ్ అండ్ నెక్” క్యాన్సర్లు.. 26 శాతం కేసులు..

కవాసకి ఈ బైకు‌ని 2030 నాటికి మార్కెట్‌లోకి తీసుకురావాలని భావిస్తోంది. కవాసకి నింజా H2 SX పేరుతో పిలిచే ఈ బైకులో హైడ్రోజన్ సిస్టమ్ పొందుపరిచారు. ఇది 998 cc ఇన్‌లైన్ ఫోర్ సూపర్ ఛార్జ్‌డ్ ఇంజన్ కలిగి ఉంటుంది. డైరెక్ట్ హైడ్రోజన్ ఫ్యూయన్ ఇంజెక్షన్‌తో అప్‌గ్రేడ్ చేయబడింది. ఇది సాధారణంగా పెట్రోల్ ఇంజిన్ మాదిరిగానే ఉంటుంది. అయితే, పెట్రోల్‌తో నడిచే వాహనాల్లో పర్యావరణానికి హాని కలిగించే కార్బన్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ విడుదలవుతుంది. కానీ హైడ్రోజన్ ఇంజన్‌లో నీటి ఆవిరి మాత్రమే వెలువడుతుంది. పెట్రోల్ ఆధారిత ఇంజన్లతో పోలిస్తే, హైడ్రోజన్ ఇంజన్లు వివిధ ఉష్ణోగ్రతల వద్ద ప్రభావశీలంగా మండుతాయి.

కవాసకి నింజా H2 SX బేస్ మోడల్ 137 Nm మరియు 210 హార్స్‌పవర్ గరిష్ట టార్క్‌ను కలిగి ఉంది. హైడ్రోజన్ స్మాల్ మొబిలిటీ అండ్ ఇంజిన్ టెక్నాలజీ (HySE) కన్సార్టియంలో కవాసకి సభ్యునిగా ఉన్నారు. ఈ గ్రూపులో యమహా, సుజుకీ, హోండా సభ్యులుగా ఉన్నాయి.