Israel Iran War: ఇరాన్ అణు కార్యక్రమాలే లక్ష్యంగా ఇజ్రాయిల్ దాడులకు పాల్పడింది. ఈ రెండు దేశాలు గత 6 రోజులుగా వైమానిక దాడులు చేసుకుంటున్నాయి. మిడిల్ ఈస్ట్ సంఘర్షణపై ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ దాడుల తర్వాత ‘‘ప్రపంచం విపత్తుకు మిల్లీ మీటర్ల దూరంలో ఉంది’’ అని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా బుధవారం అన్నారు.
Read Also: Raja Singh: “వాళ్లను గుడిలోకి రానివ్వొద్దు”.. బోనాల నిర్వహకులకు రాజాసింగ్ కీలక సూచనలు..
రష్యా, యూఏఈ ఈ సంఘర్షణ ముగియాలని కోరుకుంటున్నట్లు క్రెమ్లిన్ పేర్కొంది. ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం గురించి రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్, యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ బుధవారం ఫోన్ ద్వారా మాట్లాడుకున్నారు. రెండు దేశాల మధ్య వివాదానికి వెంటనే ముగింపు పలకాల్సిన అవసరం ఉందని ఇద్దరు నేతలు అంగీకరించారని రష్యా తెలిపింది. ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య దౌత్యపరమైన పరిష్కారం కనుగొనేందుకు మధ్యవర్తిగా పనిచేయడానికి రష్యా సంసిద్ధంగా ఉందని పుతిన్ అన్నారు.
ఇదిలా ఉంటే, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇజ్రాయిల్ దాడుల్ని ఇరాన్ గట్టిగా ఎదుర్కొగలదని అన్నారు. ఇరాన్-అమెరికా అణు చర్చలు ముగియడానికి ముందే ఇజ్రాయిల్ దాడులు ప్రారంభించిందని టర్కీ ఆరోపించింది. నెతన్యాహూ హిట్లర్ ను అనుసరిస్తున్నాడని ఎర్డోగన్ విమర్శించారు.
