Site icon NTV Telugu

Ukraine Russia War: మూడో ప్రపంచ యుద్ధం వస్తే అణు విధ్వంసమే..!

ఉక్రెయిన్‌-రష్యా మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది… ఇదే సమయంలో ఉక్రెయిన్‌కు మద్దతుగా కొన్ని దేశాలు నిలుస్తున్నాయి.. ఆయుధాలు, ఇతర సమాగ్రి సరఫరా చేస్తున్నాయి.. దీంతో.. మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందా? అనే చర్చ సాగుతోంది.. ఇదే సమయంలో రష్యా విదేశాంగవాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. మూడో ప్రపంచ యుద్ధమే వస్తే అది అణ్వాయుధాల‌తోనే సాగుతుందని.. ఈ యుద్ధంతో పెను విధ్వంసం త‌ప్పద‌ని ర‌ష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ వ్యాఖ్యానించారు.. ఇక, ఉక్రెయిన్ అణ్వాయుధాల‌ను స‌మీక‌రించేందుకు ర‌ష్యా అనుమ‌తించబోదని స్పష్టం చేసిన ఆయన.. ఆంక్షల‌కు ర‌ష్యా సిద్ధంగా ఉందన్నారు.. కానీ, తమ దేశానికి చెందిన అథ్లెట్లు, జ‌ర్నలిస్టులు, సాంస్క్రతిక ప్రతినిధుల‌ను పాశ్చాత్య దేశాలు టార్గెట్ చేస్తాయ‌ని ఊహించలేదన్నారు..

Read Also: Ukraine Russia War: ఉక్రెయిన్‌లోని అతిపెద్ద సిటీ రష్యా స్వాధీనం

ఇప్పటికే ఉక్రెయిన్‌-రష్యా మధ్య జరిగిన రెండో దఫా చర్చలు విఫలమైన విషయం తెలిసిందే కాగా.. రెండో దశ చర్చలకు కూడా సిద్ధంగానే ఉన్నామని రష్యా విదేశాంగ శాఖ మంత్రి లవ్‌రోవ్ తెలిపారు.. ఉక్రెయిన్‌తో చర్చలకు మేం సిద్ధమే.. కానీ, తమ పక్షాన అమెరికాను తెచ్చుకునేందుకు సమయం కోసమే ఉక్రెయిన్ చర్చల పేరుతో డ్రామా చేస్తోందనే అనుమాలను వ్యక్తం చేశారు. ఈ యుద్ధం మాత్రం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తే మిగిలేది అణు విధ్వంసమే అన్నారు.. అయితే పరిస్థితి అంతవరకూ రానివ్వబోమని, ఉక్రెయిన్‌ను అణ్వాయుధాలు సమీకరించుకోనివ్వబోమని స్పష్టం చేశారు. కాగా, ఉక్రెయిన్‌-రష్యా మధ్య యుద్ధం ఏడో రోజుకు చేరింది.. బాంబుల వర్షం కురుస్తోంది. ఒక్కో సిటీని ఆక్రమిస్తూ ముందుకు సాగుతోంది రష్యా.. అదే స్థాయిలో ఉక్రెయిన్‌ నుంచి ప్రతిఘటన కూడా తప్పడంలేదు. ఓ వైపు యుద్ధం సాగిస్తూనే.. మరో వైపు శాంతి చర్చలకు ప్రయత్నాలు సాగుతున్న విషయం తెలిసిందే.

Exit mobile version