కరోనా మహమ్మారికి చెక్ పెట్టాలి అంటే వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే మార్గం. అన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ వేగంగా జరిగితేనే కరోనాకు చెక్ పడుతుంది. ధనిక దేశాల్లో వేగంగా వ్యాక్సినేషన్ జరుగుతున్నా, అఫ్రికాలోని అనేక దేశాల్లో వ్యాక్సిన్ అందని పరిస్థితి. పేద దేశాలకు వ్యాక్సిన్ అందించాలనే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్యసంస్థ కోవాక్స్ ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థకు ధనిక దేశాలు, వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తున్న దేశాలు తమవంతుగా వ్యాక్సిన్‌ను అందిస్తున్నాయి.
Read: వై. యస్. జగన్ గా ‘స్కామ్ 1992’ ఫేమ్ ప్రతీక్ గాంధీ
ఇందులో ఉన్న సభ్యదేశాలకు వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే, సెప్టెంబర్ నాటికి ప్రతీ దేశంలో కనీసం 10శాతం వ్యాక్సినేషన్ పూర్తికావాలని, ఈ ఏడాది చివరి నాటికి 40శాతం, వచ్చే ఏడాది సగానికి 70శాతానికిపైగా వ్యాక్సిన్ అందించాలని, అప్పుడే కరోనాను తట్టుకొని ప్రపంచం ఆర్ధికంగా పరుగులు పెట్టే అవకాశం ఉంటుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ తెలియజేసింది.
